Logo

యెహోషువ అధ్యాయము 11 వచనము 10

యెహోషువ 11:1 హాసోరు రాజైన యాబీను జరిగినవాటినిగూర్చి విని మాదోనురాజైన యోబాబుకును షిమ్రోను రాజుకును అక్షాపు రాజుకును

న్యాయాధిపతులు 4:2 యెహోవా హాసోరులో ఏలు కనాను రాజైన యాబీనుచేతికి వారిని అప్పగించెను. అతని సేనాధిపతి అన్యుల హరోషెతులో నివసించిన సీసెరా.

యెహోషువ 8:24 బీటిలోను పొలములోను హాయి నివాసులను తరిమిన ఇశ్రాయేలీయులు వారిని చంపుట చాలింపగా, కత్తివాత కూలక మిగిలినవాడొకడును లేకపోయినప్పుడు ఇశ్రాయేలీయులందరు హాయియొద్దకు తిరిగివచ్చి దానిని కత్తి వాతను నిర్మూలము చేసిరి.

యెహోషువ 9:1 యొర్దాను అవతలనున్న మన్యములోను లోయలోను లెబానోను నెదుటి మహాసముద్ర తీరమందంతటను ఉన్న హిత్తీయులు అమోరీయులు కనానీయులు పెరిజ్జీయులు హివ్వీయులు యెబూసీయులు అను వారి రాజులందరు జరిగినదానిని వినినప్పుడు

యెహోషువ 12:19 హాసోరు రాజు, షిమ్రోన్మెరోను రాజు,

2సమూయేలు 10:19 హదదెజరునకు సేవకులగు రాజులందరు తాము ఇశ్రాయేలీయుల యెదుట నిలువలేకుండ కొట్టబడియుండుట చూచి ఇశ్రాయేలీయులతో సమాధానపడి వారికి లోబడిరి. సిరియనులు భయాక్రాంతులై అమ్మోనీయులకు ఇక సహాయము చేయుట మానిరి.

2రాజులు 15:29 ఇశ్రాయేలు రాజైన పెకహు దినములలో అష్షూరు రాజైన తిగ్లత్పిలేసెరు వచ్చి ఈయోను పట్టణమును, ఆబేల్బేత్మయకా పట్టణమును, యానోయహు పట్టణమును, కెదెషు పట్టణమును, హాసోరు పట్టణమును, గిలాదు దేశమును, గలిలయ దేశమును, నఫ్తాలీ దేశమంతయును పట్టుకొని అచ్చటనున్నవారిని అష్షూరు దేశమునకు చెరగా తీసికొనిపోయెను.