Logo

యెహోషువ అధ్యాయము 16 వచనము 3

యెహోషువ 18:13 అక్కడనుండి ఆ సరిహద్దు లూజు వైపున, అనగా బేతేలను లూజు దక్షిణమువరకు సాగి క్రింది బెత్‌హోరోనుకు దక్షిణముననున్న కొండమీది అతారోతు అద్దారువరకు వ్యాపించెను.

1రాజులు 9:15 యెహోవా మందిరమును సొలొమోను నగరమును మిల్లోను, యెరూషలేముయొక్క ప్రాకారమును హాసోరు మెగిద్దో గెజెరు అను పట్టణములను కట్టించుటకు సొలొమోను వెట్టివారిని పెట్టెను.

1రాజులు 9:16 ఐగుప్తు రాజైన ఫరో గెజెరుమీదికి వచ్చి దాని పట్టుకొని అగ్నిచేత కాల్చి ఆ పట్టణమందున్న కనానీయులను హతముచేసి దానిని తన కుమార్తెయైన సొలొమోను భార్యకు కట్నముగా ఇచ్చెను.

1రాజులు 9:17 సొలొమోను గెజెరును కట్టించెను, మరియు దిగువను బేత్‌ హోరోనును,

1దినవృత్తాంతములు 7:24 అతని కుమార్తెయైన షెయెరా ఉత్తరపు బేత్‌ హోరోనును దక్షిణపు బేత్‌ హోరోనును ఉజ్జెన్‌ షెయెరాను కట్టించెను.

1దినవృత్తాంతములు 7:28 వారికి స్వాస్థ్యములైన నివాసస్థలములు బేతేలు దాని గ్రామములు తూర్పుననున్న నహరాను పడమటనున్న గెజెరు దాని గ్రామములు, షెకెము దాని గ్రామములు, గాజా దాని గ్రామములును ఉన్నంతవరకు వ్యాపించెను.

2దినవృత్తాంతములు 8:5 ఇదియు గాక అతడు ఎగువ బేత్‌హోరోను దిగువ బేత్‌హోరోను గవునులు అడ్డగడలుగల ప్రాకార పట్టణములుగా కట్టించెను.

సంఖ్యాకాండము 34:6 పడమటి సరిహద్దు ఏదనగా మహాసముద్రము, అదే మీకు పడమటి సరిహద్దుగా నుండును.

యెహోషువ 10:10 అప్పుడు యెహోవా ఇశ్రాయేలీయుల యెదుట వారిని కలవరపరచగా యెహోషువ గిబియోను నెదుట మహా ఘోరముగా వారిని హతముచేసెను. బేత్‌ హోరోనుకు పైకి పోవుమార్గమున అజేకావరకును మక్కేదావరకును యోధులు వారిని తరిమి హతము చేయుచు వచ్చిరి.

యెహోషువ 10:33 లాకీషుకు సహాయము చేయుటకు గెజెరు రాజైన హోరాము రాగా యెహోషువ నిశ్శేషముగా అతనిని అతని జనులను హతముచేసెను.

యెహోషువ 16:8 తప్పూయ మొదలుకొని ఆ సరిహద్దు కానా యేటివరకు పశ్చిమముగా వ్యాపించును. అది వారి వంశములచొప్పున ఎఫ్రాయిమీయుల గోత్ర స్వాస్థ్యము.

యెహోషువ 17:9 ఆ సరిహద్దు కానాయేటి దక్షిణ దిక్కున ఆ యేటివరకు వ్యాపించెను. మనష్షీయుల ఊళ్లలో ఆ ఊళ్లు ఎఫ్రాయిమీయులకు కలిగెను; అయితే మనష్షీయుల సరిహద్దు ఆ యేటికి ఉత్తరముగా సముద్రము వరకు వ్యాపించెను. దక్షిణ భూమి ఎఫ్రాయిమీయుల కును ఉత్తరభూమి మనష్షీయులకును కలిగెను.

యెహోషువ 21:22 కిబ్సాయిమును దాని పొలమును బేత్‌హోరోనును దాని పొలమును వారికిచ్చిరి.

1సమూయేలు 13:18 రెండవ గుంపు బేత్‌ హోరోనుకు పోవు మార్గమున సంచరించెను. మూడవ గుంపు అరణ్య సమీపమందుండు జెబోయిములోయ సరిహద్దు మార్గమున సంచరించెను.

1రాజులు 9:17 సొలొమోను గెజెరును కట్టించెను, మరియు దిగువను బేత్‌ హోరోనును,

1దినవృత్తాంతములు 6:67 ఆశ్రయ పట్టణములును ఎఫ్రాయిము పర్వతములోని షెకెమును దాని గ్రామములును, గెజెరును దాని గ్రామములును,

1దినవృత్తాంతములు 20:4 అటు తరువాత గెజెరులోనున్న ఫిలిష్తీయులతో యుద్ధము కలుగగా హుషాతీయుడైన సిబ్బెకై రెఫాయీయుల సంతతివాడగు సిప్పయి అను నొకని హతము చేసెను, అందువలన ఫిలిష్తీయులు లొంగుబాటునకు తేబడిరి.