Logo

న్యాయాధిపతులు అధ్యాయము 4 వచనము 10

న్యాయాధిపతులు 4:6 ఆమె నఫ్తాలి కెదెషులోనుండి అబీనోయము కుమారుడైన బారాకును పిలువనంపించి అతనితో ఇట్లనెనునీవువెళ్లి నఫ్తాలీయుల లోను జెబూలూనీయులలోను పదివేలమంది మనుష్యులను తాబోరు కొండయొద్దకు రప్పించుము;

న్యాయాధిపతులు 5:18 జెబూలూనీయులు మరణభయము లేక ప్రాణము తృణీకరించుకొనిన జనము నఫ్తాలీయులు భూమి మెట్టలమీద ప్రాణము తృణీక రించిరి.

న్యాయాధిపతులు 5:15 ఇశ్శాఖారీయులైన అధిపతులు దెబోరాతో కలిసి వచ్చిరి. ఇశ్శాఖారీయులును బారాకును అతివేగమున లోయలోనికి చొరబడిరి రూబేనీయుల కాలువలయొద్ద జనులకు గొప్ప హృదయాలోచనలు కలిగెను.

నిర్గమకాండము 11:8 అప్పుడు నీ సేవకులైన వీరందరు నాయొద్దకు వచ్చి నాకు నమస్కారము చేసి నీవును, నిన్ను ఆశ్రయించియున్న యీ ప్రజలందరును బయలువెళ్లుడని చెప్పుదురు. ఆ తరువాత నేను వెళ్లుదుననెను. మోషే ఆలాగు చెప్పి ఫరోయెద్దనుండి అత్యాగ్రహముతో వెళ్లిపోయెను

1సమూయేలు 25:27 అయితే నేను నా యేలినవాడవగు నీయొద్దకు తెచ్చిన యీ కానుకను నా యేలినవాడవగు నిన్ను వెంబడించు పనివారికి ఇప్పించి

1రాజులు 20:11 అందుకు ఇశ్రాయేలు రాజు తన ఆయుధమును నడుమున బిగించుకొనువాడు దానివిప్పి తీసివేసినవానివలె అతిశయపడకూడదని చెప్పుడనెను.

ఆదికాండము 30:20 అప్పుడు లేయా దేవుడు మంచి బహుమతి నాకు దయచేసెను; నా పెనిమిటికి ఆరుగురు కుమారులను కనియున్నాను గనుక అతడికను నాతో కాపురము చేయుననుకొని అతనికి జెబూలూను అను పేరు పెట్టెను

ఆదికాండము 49:21 నఫ్తాలి విడువబడిన లేడి అతడు ఇంపైన మాటలు పలుకును.

న్యాయాధిపతులు 3:28 అతడు వారికి ముందుగా సాగి వారితోనా వెంబడి త్వరగా రండి; మీ శత్రువు లైన మోయాబీయులను యెహోవా మీచేతి కప్పగించు చున్నాడనెను. కాబట్టి వారు అతని వెంబడిని దిగివచ్చి మోయాబు నెదుటి యొర్దాను రేవులను పట్టుకొని యెవనిని దాటనియ్యలేదు.

న్యాయాధిపతులు 5:14 అమాలేకీయులలో కాపురమున్న ఎఫ్రాయిమీయు లును నీ తరువాత నీ జనులలో బెన్యామీనీయులును మాకీరునుండి న్యాయాధిపతులును జెబూలూనీయులనుండి నాయకదండము వహించు వారునువచ్చిరి.

2సమూయేలు 15:16 అప్పుడు రాజు నగరిని కనిపెట్టుటకై ఉపపత్నులగు పదిమందిని ఉంచిన మీదట తన యింటివారినందరిని వెంటబెట్టుకొని కాలినడకను బయలుదేరెను.

1రాజులు 20:10 బెన్హదదు మరల అతనియొద్దకు దూతలను పంపి నాతోకూడ వచ్చిన వారందరును పిడికెడు ఎత్తికొనిపోవుటకు షోమ్రోను యొక్క ధూళి చాలినయెడల దేవతలు నాకు గొప్ప అపాయము కలుగజేయుదురు గాక అని వర్తమానము చేసెను.

2రాజులు 3:9 ఇశ్రాయేలు రాజును యూదా రాజును ఎదోము రాజును బయలుదేరి యేడు దినములు చుట్టు తిరిగిన తరువాత, వారితో కూడనున్న దండువారికిని పశువులకును నీళ్లు లేకపోయెను.

దానియేలు 11:43 అతడు విలువగల సమస్త బంగారు వెండి వస్తువులను ఐగుప్తు యొక్క విలువగల వస్తువులన్నిటిని వశపరచుకొని, లుబీయులను కూషీయులను తనకు పాదసేవకులుగా చేయును.