లేఖనాలను అన్వేషించండి

2కొరిందీయులకు 7: 13

క్రాస్-రిఫరెన్స్‌లు

" ఇందుచేత మేము ఆదరింపబడితివిు. అంతేకాదు, మాకు ఈ ఆదరణ కలిగినప్పుడు తీతు యొక్క ఆత్మ మీ అందరివలన విశ్రాంతి పొందినందున అతని సంతోషమును చూచి మరి యెక్కువగా మేము సంతోషించితివిు."

సంబంధిత రిఫరెన్స్‌లు

2కొరిందీయులకు 2:9

మీరన్ని విషయములందు విధేయులైయున్నారేమో అని మీ యోగ్యత తెలిసికొనుటకే గదా పూర్వము వ్రాసితిని.

1కొరిందీయులకు 5:1

మీలో జారత్వమున్నదని వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకొన్నాడట. అట్టి జారత్వము అన్యజనులలోనైనను జరుగదు.

2కొరిందీయులకు 2:4

మీకు దుఃఖము కలుగవలెనని కాదు గాని, మీయెడల నాకు కలిగియున్న అత్యధికమైన ప్రేమను మీరు తెలిసికొనవలెనని, నిండు శ్రమతోను మనోవేదనతోను ఎంతో కన్నీరు విడుచుచు మీకు వ్రాసితిని.

2కొరిందీయులకు 2:17

కావున ఇట్టి సంగతులకు చాలినవాడెవడు? మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకులవలె ఉండక, నిష్కాపట్యము గలవారమును దేవునివలన నియమింపబడిన వారమునైయుండి, క్రీస్తునందు దేవుని యెదుట బోధించుచున్నాము.

2కొరిందీయులకు 11:11

ఎందువలన? నేను మిమ్మును ప్రేమింపనందువలననా? దేవునికే తెలియును.

2కొరిందీయులకు 11:28

ఇవియును గాక సంఘములన్నిటినిగూర్చిన చింతయు కలదు. ఈ భారము దినదినమును నాకు కలుగుచున్నది.

1తిమోతి 3:5

ఎవడైనను తన యింటివారిని ఏలనేరకపోయినయెడల అతడు దేవుని సంఘమును ఏలాగు పాలించును?

మత్తయి 18:15

మరియు నీ సహోదరుడు నీయెడల తప్పిదము చేసినయెడల నీవు పోయి, నీవును అతడును ఒంటరిగా నున్నప్పుడు అతనిని గద్దించుము; అతడు నీ మాట వినినయెడల నీ సహోదరుని సంపాదించుకొంటివి.

1కొరిందీయులకు 7:34

అటువలెనే పెండ్లికాని స్త్రీయు కన్యకయు తాము శరీరమందును ఆత్మయందును పవిత్రురాండ్రయి యుండుటకు ప్రభువు విషయమైన కార్యములనుగూర్చి చింతించుచుందురు గాని పెండ్లియైనది భర్తను ఏలాగు సంతోషపెట్టగలనని లోకవిషయమైన వాటిని గూర్చి చింతించుచున్నది

1కొరిందీయులకు 12:25

అయితే శరీరములో వివాదములేక, అవయవములు ఒకదానినొకటి యేకముగా పరామర్శించులాగున, దేవుడు తక్కువ దానికే యెక్కువ ఘనత కలుగజేసి, శరీరమును అమర్చియున్నాడు.

2కొరిందీయులకు 5:13

ఏలయనగా మేము వెఱ్రివారమైతిమా దేవుని నిమిత్తమే; స్వస్థబుద్ధి గలవారమైతిమా మీ నిమిత్తమే.

2కొరిందీయులకు 7:3

మీకు శిక్షావిధి కలుగవలెనని నేనీలాగు చెప్పలేదు. చనిపోయిన గాని జీవించిన గాని మీరును మేమును కూడ ఉండవలెననియు మీరు మా హృదయములలో ఉన్నారనియు నేను లోగడ చెప్పితిని గదా

2కొరిందీయులకు 8:16

మీ విషయమై నాకు కలిగిన యీ ఆసక్తినే తీతు హృదయములో పుట్టించిన దేవునికి స్తోత్రము.