2కొరిందీయులకు 8: 1
క్రాస్-రిఫరెన్స్‌లు
" సహోదరులారా, మాసిదోనియ సంఘములకు అనుగ్రహింపబడియున్న దేవుని కృపనుగూర్చి మీకు తెలియజేయుచున్నాము."
సంబంధిత రిఫరెన్స్‌లు
మేము మీకు ఆజ్ఞాపించువాటిని మీరు చేయుచున్నారనియు, ఇక చేయుదురనియు ప్రభువునందు మిమ్మునుగూర్చి నమ్మకము కలిగియున్నాము.
కావున యుక్తమైనదానినిగూర్చి నీ కాజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహు ధైర్యము కలిగియున్నను,
నేను చెప్పినదానికంటె నీవు ఎక్కువగాచేతువని యెరిగి నా మాట విందువని నమ్మి నీకు వ్రాయుచున్నాను.
మీరెంతమాత్రమును వేరుగా ఆలోచింపరని ప్రభువునందు మిమ్మునుగూర్చి నేను రూఢిగా నమ్ముకొనుచున్నాను. మిమ్మును కలవరపెట్టుచున్నవాడు ఎవడైనను వాడు తగిన శిక్షను భరించును.
నేను మిమ్మును జ్ఞాపకము చేసికొనినప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.