లేఖనాలను అన్వేషించండి

అపోస్తలులకార్యములు 1: 22

క్రాస్-రిఫరెన్స్‌లు

" ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసియున్న వీరిలో ఒకడు, మనతో కూడ ఆయన పునరుత్థానమునుగూర్చి సాక్షియైయుండుట ఆవశ్యకమని చెప్పెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

లూకా 10:1

అటుతరువాత ప్రభువు డెబ్బదిమంది యితరులను నియమించి, తాను వెళ్లబోవు ప్రతి ఊరికిని ప్రతిచోటికిని తనకంటె ముందు ఇద్దరిద్దరినిగా పంపెను.

లూకా 10:2

పంపినప్పుడాయన వారితో ఇట్లనెను కోత విస్తారముగా ఉన్నది గాని పనివారు కొద్దిమందియే; కాబట్టి కోత యజమానుని తన కోతకు పనివారిని పంప వేడుకొనుడి.

యోహాను 15:27

మీరు మొదటనుండి నాయొద్ద ఉన్నవారు గనుక మీరును సాక్ష్యమిత్తురు.

సంఖ్యాకాండము 27:17

వారికి నాయకుడుగా ఉండుటకు సమర్థుడై యుండవలెను.

ద్వితియోపదేశాకాండము 31:2

ఇకమీదట నేను వచ్చుచుపోవుచు నుండలేను, యెహోవా ఈ యొర్దాను దాటకూడదని నాతో సెలవిచ్చెను.

2సమూయేలు 5:2

పూర్వకాలమున సౌలు మామీద రాజైయుండగా నీవు ఇశ్రాయేలీయులను నడిపించువాడవై ఉంటివి. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలీయులనుబట్టి నా జనులను పాలించి వారిమీద అధిపతివై యుందువని యెహోవా నిన్నుగురించి సెలవిచ్చియున్నాడని చెప్పిరి.

1రాజులు 3:7

నా దేవా యెహోవా, నీవు నా తండ్రియైన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించియున్నావు; అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు;

యోహాను 10:1

గొఱ్ఱల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొకమార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకొనువాడునై యున్నాడు.

యోహాను 10:2

ద్వారమున ప్రవేశించువాడు గొఱ్ఱల కాపరి.

యోహాను 10:3

అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొఱ్ఱలు అతని స్వరము వినును, అతడు తన సొంత గొఱ్ఱలను పేరుపెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును.

యోహాను 10:4

మరియు అతడు తన సొంత గొఱ్ఱలనన్నిటిని వెలుపలికి నడిపించునపుడెల్ల వాటికి ముందుగా నడుచును; గొఱ్ఱలు అతని స్వరమెరుగును గనుక అవి అతనిని వెంబడించును.

యోహాను 10:5

అన్యుల స్వరము అవి యెరుగవు గనుక అన్యుని ఎంతమాత్రమును వెంబడింపక వానియొద్దనుండి పారిపోవునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను.

యోహాను 10:6

ఈ సాదృశ్యము యేసు వారితో చెప్పెను గాని ఆయన తమతో చెప్పిన సంగతులెట్టివో వారు గ్రహించుకొనలేదు.

యోహాను 10:7

కాబట్టి యేసు మరల వారితో ఇట్లనెను

యోహాను 10:8

గొఱ్ఱలు పోవు ద్వారమును నేనే; నాకు ముందు వచ్చిన వారందరు దొంగలును దోచుకొనువారునై యున్నారు; గొఱ్ఱలు వారి స్వరము వినలేదు.

యోహాను 10:9

నేనే ద్వారమును; నా ద్వారా ఎవడైన లోపల ప్రవేశించినయెడల వాడు రక్షింపబడినవాడై, లోపలికి పోవుచు బయటికి వచ్చుచు మేత మేయుచునుండును.

ద్వితియోపదేశాకాండము 1:13

జ్ఞానవివేకములు కలిగి, మీ మీ గోత్రములలో ప్రసిద్ధిచెందిన మనుష్యులను ఏర్పరచుకొనుడి; వారిని మీమీద నియమించెదనని మీతో చెప్పగా

జెకర్యా 11:11

అది విరువబడిన దినమున నేను చెప్పినది యెహోవా వాక్కు అని మందలో బలహీనములై నన్ను కనిపెట్టుకొని యున్న గొఱ్ఱలు తెలిసికొనెను.

లూకా 1:2

ఆరంభమునుండి కన్నులార చూచి వాక్యసేవకులైనవారు మనకు అప్పగించిన ప్రకారము మనమధ్యను నెరవేరిన కార్యములనుగూర్చి వివరముగ వ్రాయుటకు అనేకులు పూనుకొన్నారు

అపోస్తలులకార్యములు 6:3

కాబట్టి సహోదరులారా, ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచిపేరు పొందిన యేడుగురు మనుష్యులను మీలో ఏర్పరచుకొనుడి. మేము వారిని ఈ పనికి నియమింతుము;

అపోస్తలులకార్యములు 9:28

అతడు యెరూషలేములో వారితోకూడ వచ్చుచు పోవుచు,