లేఖనాలను అన్వేషించండి

అపోస్తలులకార్యములు 18: 8

క్రాస్-రిఫరెన్స్‌లు

" ఆ సమాజమందిరపు అధికారియైన క్రిస్పు తన యింటివారందరితో కూడ ప్రభువునందు విశ్వాసముంచెను. మరియు కొరింథీయులలో అనేకులువిని విశ్వసించి బాప్తిస్మము పొందిరి."

సంబంధిత రిఫరెన్స్‌లు

కొలొస్సయులకు 4:11

మరియు యూస్తు అను యేసు కూడ మీకు వందనములు చెప్పుచున్నాడు. వీరు సున్నతి పొందినవారిలో చేరినవారు, వీరుమాత్రమే దేవుని రాజ్యము నిమిత్తము నా జత పనివారై యున్నారు, వీరివలన నాకు ఆదరణ కలిగెను.

అపోస్తలులకార్యములు 10:2

అతడు తన యింటివారందరితో కూడ దేవునియందు భయభక్తులు గలవాడైయుండి, ప్రజలకు బహు ధర్మముచేయుచు ఎల్లప్పుడును దేవునికి ప్రార్థన చేయువాడు.

అపోస్తలులకార్యములు 10:22

అందుకు వారు నీతిమంతుడును, దేవునికి భయపడువాడును, యూద జనులందరివలన మంచిపేరు పొందినవాడునైన శతాధిపతియగు కొర్నేలియను ఒక మనుష్యుడున్నాడు; అతడు నిన్ను తన యింటికి నిన్ను పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవలెనని పరిశుద్ద దూతవలన బోధింపబడెనని చెప్పిరి. అప్పుడు అతడు వారిని లోపలి పిలిచి ఆతిధ్యమిచ్చెను

అపోస్తలులకార్యములు 13:42

వారు సమాజమందిరములోనుండి వెళ్లుచుండగా ఈ మాటలను మరుసటి విశ్రాంతిదినమున తమతో చెప్పవలెనని జనులు వేడుకొనిరి.

అపోస్తలులకార్యములు 16:14

అప్పుడు లూదియయను దైవభక్తిగల యొక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయతైర పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయము తెరచెను గనుక పౌలు చెప్పిన మాటలయందు లక్ష్యముంచెను

అపోస్తలులకార్యములు 17:4

వారిలో కొందరును, భక్తిపరులగు గ్రీసుదేశస్థులలో చాలమందియు, ఘనతగల స్త్రీలలో అనేకులును ఒప్పుకొని పౌలుతోను సీలతోను కలిసికొనిరి.

యెషయా 56:3

యెహోవాను హత్తుకొను అన్యుడు నిశ్చయముగా యెహోవా తన జనులలోనుండి నన్ను వెలివేయునని అనుకొనవద్దు. షండుడు నేను ఎండిన చెట్టని అనుకొనవద్దు.

అపోస్తలులకార్యములు 19:9

అయితే కొందరు కఠినపరచబడినవారై యొప్పుకొనక, జనసమూహము ఎదుట ఈ మార్గమును దూషించుచున్నందున అతడు వారిని విడిచి, శిష్యులను ప్రత్యేకపరచుకొని ప్రతిదినము తురన్ను అను ఒకని పాటశాలలో తర్కించుచు వచ్చెను