అపోస్తలులకార్యములు 26: 22
క్రాస్-రిఫరెన్స్‌లు
" అయినను నేను దేవునివలననైన సహాయము పొంది నేటివరకు నిలిచియుంటిని; క్రీస్తు శ్రమపడి మృతుల పునరుత్థానము పొందువారిలో మొదటివాడగుటచేత, ఈ ప్రజలకును అన్యజనులకును వెలుగు ప్రచురింపబోవునని"
సంబంధిత రిఫరెన్స్‌లు
పట్టణమంతయు గలిబిలిగా ఉండెను. జనులు గుంపులు గుంపులుగా పరుగెత్తికొని వచ్చి, పౌలును పట్టుకొని దేవాలయములోనుండి అతనిని వెలుపలికి ఈడ్చిరి; వెంటనే తలుపులు మూయబడెను.
వారతని చంపవలెనని యత్నించుచుండగా యెరూషలేమంతయు గలిబిలిగా ఉన్నదని పటాలపు పై యధికారికి వర్తమానము వచ్చెను;
ఈ మాటవరకు అతడు చెప్పినది వారు ఆలకించుచుండిరి. అప్పడు ఇటువంటివాడు బ్రదుక తగడు, భూమిమీద ఉండకుండ వానిని చంపివేయుడని కేకలు వేసిరి.
ఈ కుట్రలో చేరినవారు నలుబదిమంది కంటె ఎక్కువ.
వారు ప్రధానయాజకుల యొద్దకును పెద్దల యొద్దకును వచ్చి మేము పౌలును చంపువరకు ఏమియు రుచిచూడమని గట్టిగ ఒట్టుపెట్టుకొని యున్నాము.
కాబట్టి మీరు మహాసభతో కలిసి, అతనిని గూర్చి మరి పూర్తిగా విచారించి తెలిసికొనబోవునట్టు అతనిని మీయొద్దకు తీసికొనిరమ్మని సహస్రాధిపతితో మనవి చేయుడి; అతడు దగ్గరకు రాకమునుపే మేమతని చంపుటకు సిద్ధపడియున్నామని చెప్పిరి.
అయితే పౌలు మేనల్లుడు వారు పొంచియున్నారని విని వచ్చి కోటలో ప్రవేశించి పౌలుకు ఆ సంగతి తెలిపెను.
మరియు త్రోవలో అతనిని చంపుటకు పొంచియుండి మీరు దయచేసి అతనిని యెరూషలేమునకు పిలువనంపించుడని అతనినిగూర్చి ఫేస్తు నొద్ద మనవి చేసిరి.
అప్పుడతడు లేచి, రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని,
ఏడు దినములు కావచ్చినప్పుడు ఆసియనుండి వచ్చిన యూదులు దేవాలయములో అతని చూచి, సమూహమంతటిని కలవరపరచి అతనిని బలవంతముగా పట్టుకొని
ఇశ్రాయేలీయులారా, సహాయము చేయరండి; ప్రజలకును ధర్మశాస్త్రమునకును ఈ స్థలమునకును విరోధముగా అందరికిని అంతటను బోధించుచున్నవాడు వీడే. మరియు వీడు గ్రీసుదేశస్థులను దేవాలయములోనికి తీసికొనివచ్చి యీ పరిశుద్ద స్థలమును అపవిత్రపరచియున్నాడని కేకలు వేసిరి
నేను శుద్ధి చేసికొనినవాడనై యీలాగు అప్పగించుచుండగా వారు దేవాలయములో నన్ను చూచిరి. నేను గుంపుకూర్చి యుండలేదు, నావలన అల్లరి కాలేదు. ఆసియనుండి వచ్చిన కొందరు యూదులు ఉండిరి;
ఆయన అట్టి గొప్ప మరణమునుండి మమ్మును తప్పించెను, ఇక ముందుకును తప్పించును. మరియు మాకొరకు ప్రార్థన చేయుటవలన మీరు కూడ సహాయము చేయుచుండగా, ఆయన ఇక ముందుకును మమ్మును తప్పించునని ఆయనయందు నిరీక్షణ గలవారమై యున్నాము.