లేఖనాలను అన్వేషించండి

అపోస్తలులకార్యములు 8: 7

క్రాస్-రిఫరెన్స్‌లు

" అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలువేసి వారిని వదలిపోయెను; పక్షవాయువు గలవారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి."

సంబంధిత రిఫరెన్స్‌లు

అపోస్తలులకార్యములు 13:44

మరుసటి విశ్రాంతిదినమున దాదాపుగా ఆ పట్టణమంతయు దేవుని వాక్యము వినుటకు కూడివచ్చెను.

2దినవృత్తాంతములు 30:12

యెహోవా ఆజ్ఞనుబట్టి రాజును అధిపతులును చేసిన నిర్ణయమును నెరవేర్చునట్లు యూదాలోనివారికి మనస్సు ఏకము చేయుటకై దేవుని హస్తము వారికి తోడ్పడెను.

మత్తయి 20:15

నాకిష్టము వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయము కాదా? నేను మంచివాడనైనందున నీకు కడుపుమంటగా ఉన్నదా అని చెప్పెను.

మత్తయి 20:16

ఈ ప్రకారమే కడపటివారు మొదటివారగుదురు, మొదటివారు కడపటివారగుదురు.

యోహాను 4:41

ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి ఇకమీదట నీవు చెప్పిన మాటనుబట్టి కాక

యోహాను 4:42

మామట్టుకు మేము విని, యీయన నిజముగా లోకరక్షకుడని తెలిసికొని నమ్ముచున్నామనిరి.

అపోస్తలులకార్యములు 2:41

కాబట్టి అతని వాక్యము అంగీకరించినవారు బాప్తిస్మము పొందిరి, ఆ దినమందు ఇంచుమించు మూడువేల మంది చేర్చబడిరి.

అపోస్తలులకార్యములు 6:8

స్తెఫను కృపతోను బలముతోను నిండినవాడై ప్రజలమధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను.