లేఖనాలను అన్వేషించండి

కొలొస్సయులకు 4: 16

క్రాస్-రిఫరెన్స్‌లు

" ఈ పత్రిక మీరు చదివించుకొనిన తరువాత లవొదికయ వారి సంఘములోను చదివించుడి; లవొదికయకు వ్రాసి పంపిన పత్రికను మీరును చదివించుకొనుడి."

సంబంధిత రిఫరెన్స్‌లు

కొలొస్సయులకు 4:13

ఇతడు మీకొరకును, లవొదికయ వారికొరకును, హియెరాపొలి వారికొరకును బహు ప్రయాసపడుచున్నాడని యితనినిగూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను.

రోమీయులకు 16:5

ఆసియలో క్రీస్తుకు ప్రథమఫలమైయున్న నా ప్రియుడగు ఎపైనెటుకు వందనములు.

1కొరిందీయులకు 16:9

కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించియున్నది; మరియు ఎదిరించువారు అనేకులున్నారు గనుక పెంతెకొస్తు వరకు ఎఫెసులో నిలిచియుందును.

ఫిలేమోనుకు 1:2

మన సహోదరియైన అప్ఫియకును, తోడి యోధుడైన అర్ఖిప్పునకును, నీ యింట ఉన్న సంఘమునకును శుభమని చెప్పి వ్రాయునది.

1కొరిందీయులకు 16:19

ఆసియలోని సంఘములవారు మీకు వందనములు చెప్పుచున్నారు. అకుల ప్రిస్కిల్ల అనువారును, వారి యింటనున్న సంఘమును, ప్రభువునందు మీకు అనేక వందనములు చెప్పుచున్నారు.

కొలొస్సయులకు 2:1

మీ కొరకును, లవొదికయ వారికొరకును, శరీరరీతిగా నా ముఖము చూడని వారందరికొరకును

2తిమోతి 4:10

దేమా యిహలోకమును స్నేహించి నన్ను విడిచి థెస్సలొనీకకు వెళ్లెను, క్రేస్కే గలతీయకును తీతు దల్మతియకును వెళ్లిరి;

ప్రకటన 1:11

నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి, ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైర, సార్దీస్‌, ఫిలదెల్ఫియ, లవొదికయ అను ఏడు సంఘములకు పంపుమని చెప్పుట నావెనుక వింటిని.