లేఖనాలను అన్వేషించండి

దానియేలు 2: 41

క్రాస్-రిఫరెన్స్‌లు

" పాదములును వ్రేళ్లును కొంతమట్టునకు కుమ్మరి మట్టిదిగాను కొంతమట్టునకు ఇనుపదిగా నున్నట్టు తమరికి కనబడెను గనుక ఆ రాజ్యములో భేదములుండును. అయితే ఇనుము బురదతో కలిసియున్నట్టు కనబడెను గనుక ఆ రాజ్యములో ఆలాగున నుండును, ఆ రాజ్యము ఇనుమువంటి బలముగలదై యుండును. "

సంబంధిత రిఫరెన్స్‌లు

దానియేలు 2:33

దాని మోకాళ్లు ఇనుపవియు, దాని పాదములలో ఒక భాగము ఇనుపదియు ఒక భాగము మట్టిదియునై యుండెను.

దానియేలు 7:19

ఇనుపదంతములును ఇత్తిడి గోళ్లును గల ఆ నాలుగవ జంతువు సంగతి ఏమైనదని నేను తెలిసికొనగోరితిని; అది యెన్నటికి భిన్నమును మిగుల భయంకరమునై, సమస్తమును పగులగొట్టుచు మింగుచు మిగిలిన దానిని కాళ్లక్రింద అణగద్రొక్కుచుండెను.

దానియేలు 7:20

మరియు దాని తలపైనున్న పది కొమ్ముల సంగతియు, వాటి మధ్యనుండి పెరిగి మూడు కొమ్ములను కొట్టివేసి, కన్నులును గర్వముగా మాటలాడు నోరును గల ఆ వేరగు కొమ్ము సంగతియు, అనగా దాని కడమ కొమ్ములకంటె బలము కలిగిన ఆ కొమ్ము సంగతియు విచారించితిని.

దానియేలు 7:21

ఈ కొమ్ము పరిశుద్ధులతో యుద్ధము చేయుచు వారిని గెలుచునదాయెను.

దానియేలు 7:22

ఆ మహా వృద్ధుడు వచ్చి మహోన్నతుని పరిశుద్ధుల విషయములో తీర్పు తీర్చువరకు ఆలాగు జరుగును గాని సమయము వచ్చినప్పుడు ఆ పరిశుద్ధులు రాజ్యమునేలుదురను సంగతి నేను గ్రహించితిని.

దానియేలు 7:23

నేనడగినదానికి ఆ పరిచారకుడు ఈలాగున చెప్పెను ఆ నాలుగవ జంతువు లోకములో తక్కిన ఆ మూడు రాజ్యములకు భిన్నమగు నాలుగవ రాజ్యమును సూచించుచున్నది. అది సమస్తమును అణగద్రొక్కుచు పగులగొట్టుచు లోకమంతయు భక్షించును.

దానియేలు 7:24

ఆ పది కొమ్ములు ఆ రాజ్యము నుండి పుట్టబోవు పదిమంది రాజులను సూచించుచున్నవి; కడపట ముందుగా ఉన్న రాజులకు భిన్నమగు మరియొక రాజుపుట్టి ఆ ముగ్గురు రాజులను పడద్రోయును.

దానియేలు 7:25

ఆ రాజు మహోన్నతునికి విరోధముగా మాటలాడుచు మహోన్నతుని భక్తులను నలుగగొట్టును; అతడు పండుగ కాలములను న్యాయ పద్ధతులను నివారణచేయ బూనుకొనును; వారు ఒక కాలము కాలములు అర్థకాలము అతని వశమున నుంచబడుదురు.

దానియేలు 7:26

అతని యధికారము నశింపజేయుటకును నిర్మూలము చేయుటకును తీర్పు విధింపబడెను గనుక అది కొట్టివేయబడును.

దానియేలు 8:24

అతడు గెలుచును గాని తన స్వబలమువలన గెలువడు; ఆశ్చర్యముగా శత్రువులను నాశనము చేయుటయందు అభివృద్ధి పొందుచు, ఇష్టమైనట్టుగా జరిగించుచు బలవంతులను, అనగా పరిశుద్ధ జనమును నశింపజేయును.

దానియేలు 9:26

ఈ అరువదిరెండు వారములు జరిగిన పిమ్మట ఏమియు లేకుండ అభిషిక్తుడు నిర్మూలము చేయబడును. వచ్చునట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపజేయుదురు, వాని అంతము హఠాత్తుగా వచ్చును. మరియు యుద్ధకాలాంతమువరకు నాశనము జరుగునని నిర్ణయింపబడెను.

దానియేలు 11:36

ఆ రాజు ఇష్టానుసారముగా జరిగించి తన్ను తానే హెచ్చించుకొనుచు అతిశయపడుచు, ప్రతి దేవత మీదను దేవాది దేవుని మీదను గర్వముగా మాటలాడుచు ఉగ్రత సమాప్తియగువరకు వృద్ధిపొందును; అంతట నిర్ణయించినది జరుగును.

దానియేలు 11:37

అతడు అందరికంటె ఎక్కువగా తన్నుతాను హెచ్చించుకొనును గనుక తన పితరుల దేవతలను లక్ష్యపెట్టడు; మరియు స్త్రీలకాంక్షితా దేవతను గాని, యే దేవతను గాని లక్ష్యపెట్టడు.

దానియేలు 11:38

అతడు తన పితరులెరుగని దేవతను, అనగా ప్రాకారముల దేవతను వారి దేవతకు మారుగా ఘనపరచును; బంగారును వెండిని విలువగల రాళ్లను మనోహరమైన వస్తువులను అర్పించి, ఆ దేవతను ఘనపరచును.

దానియేలు 11:39

మరియు ఈ క్రొత్త దేవతను ఆధారము చేసికొని, కోటలకు ప్రాకారములు కట్టించి, నూతన విధముగా తనవారికి మహా ఘనత కలుగజేయును; దేశమును క్రయమునకు విభజించి యిచ్చి అనేకుల మీద తనవారికి ప్రభుత్వమిచ్చును.

దానియేలు 11:40

అంత్యకాలమందు దక్షిణ దేశపు రాజు అతనితో యుద్ధము చేయును. మరియు ఉత్తర దేశపు రాజు రథములను గుఱ్ఱపు రౌతులను అనేకమైన ఓడలను సమకూర్చుకొని, తుపానువలె అతని మీదపడి దేశముల మీదుగా ప్రవాహమువలె వెళ్లును.

దానియేలు 11:41

అతడు ఆనందదేశమున ప్రవేశించుటవలన అనేకులు కూలుదురు గాని ఎదోమీయులును మోయాబీయులును అమ్మోనీయులలో ముఖ్యులును అతనిచేతిలోనుండి తప్పించుకొనెదరు.

దానియేలు 11:42

అతడు ఇతర దేశముల మీదికి తన సేన నంపించును; ఐగుప్తు సహా తప్పించుకొననేరదు.

దానియేలు 11:43

అతడు విలువగల సమస్త బంగారు వెండి వస్తువులను ఐగుప్తు యొక్క విలువగల వస్తువులన్నిటిని వశపరచుకొని, లుబీయులను కూషీయులను తనకు పాదసేవకులుగా చేయును.

దానియేలు 11:44

అంతట తూర్పునుండియు ఉత్తరమునుండియు వర్తమానములు వచ్చి యతని కలతపరచును గనుక అత్యాగ్రహము కలిగి అనేకులను పాడుచేయుటకును నశింపజేయుటకును అతడు బయలుదేరును.

దానియేలు 11:45

కాబట్టి తన నగరు డేరాను సముద్రములకును పరిశుద్ధానందములుగల పర్వతమునకును మధ్య వేయును; అయితే అతనికి నాశనము రాకుండుటకై సహాయము చేయువాడెవడును లేకపోవును.

యోహాను 11:48

మనమాయనను ఈలాగు చూచుచు ఊరకుండినయెడల అందరు ఆయనయందు విశ్వాసముంచెదరు; అప్పుడు రోమీయులు వచ్చి మన స్థలమును మన జనమును ఆక్రమించుకొందురని చెప్పిరి.

దానియేలు 7:7

పిమ్మట రాత్రియందు నాకు దర్శనములు కలిగినప్పుడు నేను చూచుచుండగా, ఘోరమును భయంకరమునగు నాలుగవ జంతువొకటి కనబడెను. అది తనకు ముందుగా నుండిన యితర జంతువులకు భిన్నమైనది; అది మహా బలమహాత్త్యములు గలది; దానికి పెద్ద ఇనుపదంతములును పది కొమ్ములు నుండెను. అది సమస్తమును భక్షించుచు తుత్తునియలుగా చేయుచు మిగిలినదానిని కాళ్లక్రింద అణగద్రొక్కుచుండెను.

యిర్మియా 15:12

ఇనుమునైనను ఉత్తరమునుండి వచ్చు యినుమునైనను కంచునైనను ఎవడైన విరువగలడా?

ఆమోసు 1:3

యెహోవా సెలవిచ్చునదేమనగా దమస్కు మూడుసార్లు నాలుగుసార్లు చేసిన దోషములనుబట్టి నేను తప్పకుండ దాని శిక్షింతును; ఏలయనగా దాని జనులు పంట దుళ్లగొట్టు ఇనుప పనిముట్లతో గిలాదును నూర్చిరి.

విలాపవాక్యములు 3:11

నాకు త్రోవలేకుండ చేసి నా యవయవములను విడదీసియున్నాడు నాకు దిక్కులేకుండ చేసియున్నాడు

దానియేలు 7:23

నేనడగినదానికి ఆ పరిచారకుడు ఈలాగున చెప్పెను ఆ నాలుగవ జంతువు లోకములో తక్కిన ఆ మూడు రాజ్యములకు భిన్నమగు నాలుగవ రాజ్యమును సూచించుచున్నది. అది సమస్తమును అణగద్రొక్కుచు పగులగొట్టుచు లోకమంతయు భక్షించును.

జెకర్యా 6:3

మూడవ రథమునకు తెల్లని గుఱ్ఱములు నాలుగవ రథమునకు చుక్కలు చుక్కలుగల బలమైన గుఱ్ఱములుండెను.

జెకర్యా 14:2

ఏలయనగా యెరూషలేము మీద యుద్ధము చేయుటకు నేను అన్యజనులందరిని సమకూర్చబోవుచున్నాను; పట్టణము పట్టబడును, ఇండ్లు కొల్లపెట్టబడును, స్త్రీలు చెరుపబడుదురు, పట్టణములో సగముమంది చెరపట్టబడి పోవుదురు; అయితే శేషించువారు నిర్మూలము కాకుండ పట్టణములో నిలుతురు.

1కొరిందీయులకు 15:28

మరియు సమస్తమును ఆయనకు లోపరచబడినప్పుడు దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోపరచిన దేవునికి తానే లోబడును.

ప్రకటన 17:12

నీవు చూచిన ఆ పది కొమ్ములు పదిమంది రాజులు. వారిదివరకు రాజ్యమును పొందలేదు గాని యొక గడియ క్రూరమృగముతో కూడ రాజులవలె అధికారము పొందుదురు.

ప్రకటన 17:18

మరియు నీవు చూచిన ఆ స్త్రీ భూరాజుల నేలు ఆ మహా పట్టణమే.

ప్రకటన 19:20

అప్పుడా మృగమును, దానియెదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనిన వారిని ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరచిన ఆ అబద్ధ ప్రవక్తయు, పట్టబడి వారిద్దరు గంధకముతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడిరి