దానియేలు 4: 27
క్రాస్-రిఫరెన్స్‌లు
" రాజా, నా యోచన నీ దృష్టికి అంగీకారమగునుగాక; ఒకవేళ నీవు నీ పాపములు మాని నీతి న్యాయములననుసరించి, నీవు బాధపెట్టిన వారియందు కరుణ చూపినయెడల నీకున్న క్షేమము నీకికమీదట నుండునని దానియేలు ప్రత్యుత్తరమిచ్చెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
అయితే అది మంచునకు తడిసి పశువులవలె పచ్చికలో నివసించునట్లు దాని మొద్దును ఇనుము ఇత్తడి కలిసిన కట్టుతో కట్టించి, పొలములోని గడ్డిపాలగునట్లు దానిని భూమిలో విడువుడి.
నేను మీతో చెప్పునదేమనగా ఎంతమాత్రము ఒట్టు పెట్టుకొనవద్దు; ఆకాశము తోడనవద్దు; అది దేవుని సింహాసనము, భూమి తోడనవద్దు,
శిష్యులదిచూచి ఆశ్చర్యపడి అంజూరపుచెట్టు ఎంత త్వరగా ఎండిపోయెనని చెప్పుకొనిరి.
నేను లేచి నా తండ్రియొద్దకు వెళ్లి--తండ్రీ, నేను పరలోకమునకు విరోధముగాను నీ యెదుటను పాపము చేసితిని;
అప్పుడు ఆ కుమారుడు అతనితో తండ్రీ, నేను పరలోకమునకు విరోధముగాను నీ యెదుటను పాపము చేసితిని; ఇకమీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాననెను.
తమయొద్ద నుండి మనుష్యులు నిన్ను తరిమెదరు; నీవు అడవిజంతువుల మధ్య నివాసము చేయుచు పశువులవలె గడ్డి మేసెదవు; సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యముపైన అధికారియై యుండి, తానెవనికి దాని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించునని నీవు తెలిసికొనువరకు ఏడు కాలములు నీకీలాగు జరుగునని చెప్పెను.
ఆ కాలము గడచిన పిమ్మట నెబుకద్నెజరను నేను మరల మానవబుద్ధి గలవాడనై నా కండ్లు ఆకాశముతట్టు ఎత్తి, చిరంజీవియు సర్వోన్నతుడునగు దేవుని స్తోత్రము చేసి ఘనపరచి స్తుతించితిని; ఆయన ఆధిపత్యము చిరకాలమువరకు ఆయన రాజ్యము తరతరములకు నున్నవి.
అయితే దేశనివాసులు చేసిన క్రియలనుబట్టి దేశము పాడగును.
యోహాను ఇచ్చిన బాప్తిస్మము పరలోకమునుండి కలిగినదా మనుష్యులనుండి కలిగినదా? అని వారినడుగగా