దానియేలు 6: 22
క్రాస్-రిఫరెన్స్‌లు
" నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూతనంపించి, సింహములు నాకు ఏహానియు చేయకుండ వాటి నోళ్లు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసినవాడను కాను గదా అనెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
కాబట్టి ఆ ప్రధానులును అధిపతులును రాజు నొద్దకు సందడిగా కూడి వచ్చి ఇట్లనిరి రాజగు దర్యావేషూ, చిరంజీవివై యుందువుగాక.
కల్దీయులు సిరియా బాషతో ఇట్లనిరి రాజు చిరకాలము జీవించునుగాక. తమరి దాసులకు కల సెలవియ్యుడి; మేము దాని భావమును తెలియజేసెదము.
నేను మిగుల భయపడి రాజు చిరంజీవి యగునుగాక, నా పితరుల సమాధులుండు పట్టణము పాడైపోయి, దాని గుమ్మములును అగ్నిచేత కాల్చబడి యుండగా నాకు దుఃఖముఖము లేకపోవునా అని రాజుతో అంటిని.
దావీదుతో స్నేహముగానున్న అర్కీయుడైన హూషైయనునతడు అబ్షాలోమునొద్దకువచ్చి అతని దర్శించి రాజు చిరంజీవియగును గాక రాజు చిరంజీవియగును గాక అని పలుకగా
బత్షెబ సాగిలపడి రాజునకు నమస్కారము చేసి నా యేలినవాడైన రాజగు దావీదు సదాకాలము బ్రదుకును గాక అనెను.
అప్పుడు యాజకుడు రాజకుమారుని బయటకు తోడుకొనిపోయి అతని తలమీద కిరీటము పెట్టి, ధర్మశాస్త్రగ్రంథమును అతని చేతికిచ్చిన తరువాత వారు అతని పట్టాభిషిక్తునిగా చేసి చప్పట్లుకొట్టి రాజు చిరంజీవియగునుగాకని చాటించిరి.
రాజైన దర్యావేషునకు సకల క్షేమప్రాప్తి యగునుగాక.
రాజగు నెబుకద్నెజరు నొద్ద ఈలాగు మనవి చేసిరి రాజు చిరకాలము జీవించును గాక.
రాజునకును అతని యధిపతులకును జరిగిన సంగతి రాణి తెలిసికొని విందు గృహమునకు వచ్చి ఇట్లనెను రాజు చిరకాలము జీవించునుగాక, నీ తలంపులు నిన్ను కలవరపరచనియ్యకుము, నీ మనస్సు నిబ్బరముగా ఉండనిమ్ము.