దానియేలు 8: 6
క్రాస్-రిఫరెన్స్‌లు
" ఈ మేకపోతు నేను నదిప్రక్కను నిలుచుట చూచిన రెండు కొమ్ములు గల పొట్టేలు సమీపమునకు వచ్చి, భయంకరమైన కోపముతోను బలముతోను దానిమీదికి డీకొని వచ్చెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
బొచ్చుగల ఆ మేకపోతు గ్రేకుల రాజు; దాని రెండు కన్నుల మధ్యనున్న ఆ పెద్దకొమ్ము వారి మొదటి రాజును సూచించుచున్నది.
ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారుమయమైనదియు,దాని రొమ్మును భుజములును వెండివియు, దాని ఉదరమును తొడలును ఇత్తడివియు,
తాము చనిపోయిన తరువాత తమరి రాజ్యముకంటె తక్కువైన రాజ్యమొకటి లేచును. అటుతరువాత లోకమంత యేలునట్టి మూడవ రాజ్యమొకటి లేచును. అది యిత్తడి వంటిదగును.
అటు పిమ్మట చిరుతపులిని పోలిన మరియొక జంతువును చూచితిని. దాని వీపున పక్షిరెక్కలవంటి నాలుగు రెక్కలుండెను; దానికి నాలుగు తలలుండెను; దానికి ఆధిపత్యమియ్యబడెను.
ఆ మేకపోతు అత్యధికముగా బలము చూపుచు వచ్చెను; అది బహుగా పుష్టినొందగా దాని పెద్దకొమ్ము విరిగెను; విరిగినదానికి బదులుగా నాలుగు ప్రసిద్ధమైన కొమ్ములు ఆకాశపు నలుదిక్కులకు నాలుగు పెరిగెను,
బొచ్చుగల ఆ మేకపోతు గ్రేకుల రాజు; దాని రెండు కన్నుల మధ్యనున్న ఆ పెద్దకొమ్ము వారి మొదటి రాజును సూచించుచున్నది.
అంతలో శూరుడగు ఒక రాజు పుట్టి మహా విశాలమైన రాజ్యము నేలి యిష్టానుసారముగా జరిగించును.
కిత్తీము తీరమునుండి ఓడలు వచ్చును. అవి అష్షూరును ఏబెరును బాధించును. కిత్తీయులుకూడ నిత్యనాశనము పొందుదురనెను.
అతడు నేనెందుకు నీయొద్దకు వచ్చితినో అది నీకు తెలిసినది గదా; నేను పారసీకుడగు అధిపతితో యుద్ధము చేయుటకు మరల పోయెదను. నేను బయలుదేరుచుండగానే గ్రేకేయుల దేశము యొక్క అధిపతి వచ్చును.
ఈ మనుష్యులను మనమేమి చేయుదము? వారిచేత ప్రసిద్ధమైన సూచక క్రియ చేయబడియున్నదని యెరూషలేములో కాపురమున్న వారికందరికి స్పష్టమే, అది జరుగలేదని చెప్పజాలము