లేఖనాలను అన్వేషించండి

హెబ్రీయులకు 12: 28

క్రాస్-రిఫరెన్స్‌లు

" అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది, దైవ కృప కలిగియుందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవచేయుదము,"

సంబంధిత రిఫరెన్స్‌లు

కీర్తనలు 102:26

అవి నశించును గాని నీవు నిలచియుందువు అవియన్నియు వస్త్రమువలె పాతగిలును ఒకడు అంగవస్త్రమును తీసివేసినట్లు నీవు వాటిని తీసివేయుదువు అవి మార్చబడును.

కీర్తనలు 102:27

నీవు ఏకరీతిగా నుండువాడవు నీ సంవత్సరములకు అంతము లేదు.

యెహెజ్కేలు 21:27

నేను దానిని పడద్రోయుదును పడద్రోయుదును పడద్రోయుదును; దాని స్వాస్థ్యకర్త వచ్చువరకు అదియు నిలువదు, అప్పుడు నేను దానిని అతనికిచ్చెదను.

మత్తయి 24:35

ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏ మాత్రమును గతింపవు.

2పేతురు 3:10

అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దానిమీదనున్న కృత్యములును కాలిపోవును

2పేతురు 3:11

ఇవన్నియు ఇట్లు లయమైపోవునవి గనుక, ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టియు, పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవునట్టియు,

ప్రకటన 11:15

ఏడవ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు ఈ లోకరాజ్యము మన ప్రభువు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమునాయెను; ఆయన యుగయుగముల వరకు ఏలుననెను.

ప్రకటన 21:1

అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను. సముద్రమును ఇకను లేదు.

యోబు 26:11

ఆయన గద్దింపగా ఆకాశవిశాల స్తంభములు విస్మయమొంది అదరును

యెషయా 13:13

సైన్యములకధిపతియగు యెహోవా ఉగ్రతకును ఆయన కోపాగ్ని దినమునకును ఆకాశము వణకునట్లును భూమి తన స్థానము తప్పునట్లును నేను చేసెదను.

యెషయా 66:22

నేను సృజింపబోవు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమియు లయముకాక నా సన్నిధిని నిలుచునట్లు నీ సంతతియు నీ నామమును నిలిచియుండును ఇదే యెహోవా వాక్కు.

యెహెజ్కేలు 26:15

తూరునుగూర్చి ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా నీవు కూలునప్పుడు కలుగు ధ్వనియు, హతులగుచున్నవారి కేకలును, నీలో జరుగు గొప్పవధయు ద్వీపములు విని కంపించును.

యెహెజ్కేలు 31:16

అతని పాటు ధ్వనిచేత జనములను వణకజేసితిని, నీరు పీల్చు లెబానోను శ్రేష్ఠవృక్షములన్నియు ఏదెను వృక్షములన్నియు పాతాళములో తమ్మును తాము ఓదార్చుకొనిరి.

హగ్గయి 2:21

యూదా దేశపు అధికారియగు జెరుబ్బాబెలుతో ఇట్లనుము ఆకాశమును భూమిని నేను కంపింపజేయుచున్నాను.

మత్తయి 24:7

జనముమీదికి జనమును రాజ్యముమీదికి రాజ్యమును లేచును.

లూకా 21:10

మరియు ఆయన వారితో ఇట్లనెను జనముమీదికి జనమును రాజ్యముమీదికి రాజ్యమును లేచును;

హెబ్రీయులకు 1:11

ఆకాశములు కూడ నీచేతి పనులే అవి నశించును గాని నీవు నిలిచియుందువు అవన్నియు వస్త్రమువలె పాతగిలును

హెబ్రీయులకు 10:9

ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చియున్నానని చెప్పుచున్నాడు. ఇవన్నియు ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి. ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు.

హెబ్రీయులకు 12:26

అప్పుడాయన శబ్దము భూమిని చలింపచేసెను గాని యిప్పుడు నేనింకొకసారి భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడ కంపింపచేతును అని మాట యిచ్చియున్నాడు.