హెబ్రీయులకు 7: 11
క్రాస్-రిఫరెన్స్‌లు
" ఆ లేవీయులు యాజకులై యుండగా ప్రజలకు ధర్మశాస్త్రమియ్యబడెను గనుక ఆ యాజకులవలన సంపూర్ణసిద్ధి కలిగినయెడల అహరోను క్రమములో చేరినవాడని చెప్పబడక మెల్కీసెదెకు క్రమము చొప్పున వేరొక యాజకుడు రావలసిన అవసరమేమి?"
సంబంధిత రిఫరెన్స్‌లు
మరియు లేవి కుమాళ్లలోనుండి యాజకత్వము పొందువారు, తమ సహోదరులు అబ్రాహాము గర్భవాసమునుండి పుట్టినను, ధర్మశాస్త్రము చొప్పున వారియొద్ద, అనగా ప్రజలయొద్ద పదియవ వంతును పుచ్చుకొనుటకు ఆజ్ఞను పొందియున్నారు గాని
మరియు దేవుడు నేను సర్వశక్తిగల దేవుడను; నీవు ఫలించి అభివృద్ధి పొందుము. జనమును జనముల సమూహమును నీవలన కలుగును; రాజులును నీ గర్భవాసమున పుట్టెదరు.
యాకోబు కోడండ్రను వినాయించి అతని గర్భవాసమున పుట్టి యాకోబుతో ఐగుప్తునకు వచ్చిన వారందరు అరువది ఆరుగురు.
అయినను నీవు మందిరమును కట్టించకూడదు; నీ నడుములోనుండి పుట్టబోవు నీ కుమారుడు నా నామ ఘనతకు ఒక మందిరమును కట్టించును.
మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసికొనివచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు.