యోవేలు 2: 1
క్రాస్-రిఫరెన్స్‌లు
" సీయోను కొండమీద బాకా ఊదుడి నా పరిశుద్ధ పర్వతముమీద హెచ్చరికనాదము చేయుడి యెహోవా దినము వచ్చుచున్నదనియు అది సమీపమాయెననియు దేశనివాసులందరు వణకుదురు గాక."
సంబంధిత రిఫరెన్స్‌లు
తిండిలేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొఱ్ఱపెట్టునప్పుడు కాకికి ఆహారము సిద్ధపరచువాడెవడు?
సింహపు పిల్లలు వేటకొరకు గర్జించుచున్నవి తమ ఆహారమును దేవునిచేతిలోనుండి తీసికొనజూచుచున్నవి.
సర్వజీవుల కన్నులు నీవైపు చూచుచున్నవి తగిన కాలమందు నీవు వారికి ఆహారమిచ్చుదువు.
పశువులకును అరచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారమిచ్చువాడు.
కొంతకాలమైన తరువాత దేశములో వర్షము లేక ఆ నీరు ఎండిపోయెను.
అహాబు దేశములోని ఉదకధారలన్నిటిని నదులన్నిటిని చూడబోయి, పశువులన్నిటిని పోగొట్టుకొనకుండ గుఱ్ఱములను కంచరగాడిదలను ప్రాణములతో కాపాడుటకై మనకు గడ్డి దొరుకునేమో తెలిసికొనుమని ఓబద్యాకు ఆజ్ఞ ఇచ్చెను.
దేశనివాసుల చెడుతనమునుబట్టి
వారిలో ప్రధానులు బీదవారిని నీళ్లకు పంపుచున్నారు, వారు చెరువులయొద్దకు రాగా నీళ్లు దొరుకుటలేదు, వట్టి కుండలు తీసికొని వారు మరల వచ్చుచున్నారు, సిగ్గును అవమానము నొందినవారై తమ తలలు కప్పుకొనుచున్నారు.
దేశములో వర్షము కురువక పోయినందున నేల చీలియున్నది గనుక సేద్యము చేయువారు సిగ్గుపడి తలలు కప్పుకొనుచున్నారు.
మేతలేక పశువులు బహుగా మూల్గుచున్నవి ఎడ్లు మందలుగా కూడి ఆకలికి అల్లాడుచున్నవి గొఱ్ఱమందలు చెడిపోవుచున్నవి.
వాటిముందర అగ్ని మండుచున్నది వాటివెనుక మంట కాల్చుచున్నది అవి రాకమునుపు భూమి ఏదెను వనమువలె ఉండెను అవి వచ్చిపోయిన తరువాత తప్పించుకొనినదేదియు విడువబడక భూమి యెడారివలె పాడాయెను.