యోనా 2: 6
క్రాస్-రిఫరెన్స్‌లు
" నేను మరెన్నటికిని ఎక్కిరాకుండ భూమి గడియలు వేయబడియున్నవి; పర్వతముల పునాదులలోనికి నేను దిగియున్నాను, నా దేవా, యెహోవా, నీవు నా ప్రాణము కూపములోనుండి పైకి రప్పించియున్నావు. "
సంబంధిత రిఫరెన్స్‌లు
నాశనకరమైన గుంటలోనుండియు జిగటగల దొంగ ఊబిలోనుండియు. ఆయన నన్ను పైకెత్తెను నా పాదములు బండమీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను.
దేవా, జలములు నా ప్రాణముమీద పొర్లుచున్నవి నన్ను రక్షింపుము.
నిలుకయియ్యని అగాధమైన దొంగ ఊబిలో నేను దిగిపోవుచున్నాను అగాధ జలములలో నేను దిగబడియున్నాను వరదలు నన్ను ముంచివేయుచున్నవి.
నీళ్లు నా తలమీదుగా పారెను నాశనమైతినని నేననుకొంటిని.
ఉన్నత స్థలమునుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను నన్ను పట్టుకొని మహా జలరాసులలోనుండి తీసెను.
ఏ జనమునుగూర్చి నేను చెప్పితినో ఆ జనము చెడుతనము చేయుట మానినయెడల నేను వారికి చేయనుద్దేశించిన కీడునుగూర్చి సంతాపపడుదును.