యెహోషువ 10: 33
క్రాస్-రిఫరెన్స్‌లు
" లాకీషుకు సహాయము చేయుటకు గెజెరు రాజైన హోరాము రాగా యెహోషువ నిశ్శేషముగా అతనిని అతని జనులను హతముచేసెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
గెజెరు రాజు, దెబీరు రాజు,
అది బేతేలు నుండి లూజువరకు పోయి అతారోతు అర్కీయుల సరి హద్దువరకు సాగి క్రింది బేత్‌హోరోనువరకును గెజెరు వరకును పడమటివైపుగా యప్లేతీయుల సరిహద్దువరకు వ్యాపించెను. దాని సరిహద్దు సముద్రమువరకు సాగెను.
అయితే గెజెరులో నివసించిన కనానీయుల దేశమును వారు స్వాధీనపరుచుకొనలేదు. నేటివరకు ఆ కనానీయులు ఎఫ్రాయిమీయులమధ్య నివసించుచు పన్నుకట్టు దాసులైయున్నారు.
నాలుగు పట్టణములను, అనగా ఎఫ్రాయిమీ యుల మన్యదేశములో నరహంతకునికొరకు ఆశ్రయపట్టణ మైన షెకెమును దాని పొలమును గెజె రును దాని పొలమును
ఎఫ్రాయిమీయులు గెజెరులో నివసించిన కనానీయులను వెళ్లగొట్టలేదు, గెజెరులో కనానీయులు వారి మధ్యను నివసించిరి.
ఐగుప్తు రాజైన ఫరో గెజెరుమీదికి వచ్చి దాని పట్టుకొని అగ్నిచేత కాల్చి ఆ పట్టణమందున్న కనానీయులను హతముచేసి దానిని తన కుమార్తెయైన సొలొమోను భార్యకు కట్నముగా ఇచ్చెను.
సొలొమోను గెజెరును కట్టించెను, మరియు దిగువను బేత్ హోరోనును,
ఆశ్రయ పట్టణములును ఎఫ్రాయిము పర్వతములోని షెకెమును దాని గ్రామములును, గెజెరును దాని గ్రామములును,
అటు తరువాత గెజెరులోనున్న ఫిలిష్తీయులతో యుద్ధము కలుగగా హుషాతీయుడైన సిబ్బెకై రెఫాయీయుల సంతతివాడగు సిప్పయి అను నొకని హతము చేసెను, అందువలన ఫిలిష్తీయులు లొంగుబాటునకు తేబడిరి.
యెహోషువ హాయిరాజును సాయంకాలమువరకు మ్రానుమీద వ్రేలాడ దీసెను. ప్రొద్దు గ్రుంకు చున్నప్పుడు సెలవియ్యగా జనులు వాని శవమును మ్రానుమీదనుండి దించి ఆ పురద్వారము నెదుట దాని పడవేసి దానిమీద పెద్ద రాళ్లకుప్ప వేసిరి. అది నేటివరకు ఉన్నది.
దానిని దాని రాజును దాని సమస్త పుర ములను పట్టుకొని కత్తివాతను హతముచేసి దానిలోనున్న వారినందరిని నిర్మూలముచేసిరి. అతడు హెబ్రోనుకు చేసినట్లు, లిబ్నాకును దాని రాజునకును చేసినట్లు, అతడు దెబీరుకును దాని రాజునకును చేసెను.
యెహోవా మందిరమును సొలొమోను నగరమును మిల్లోను, యెరూషలేముయొక్క ప్రాకారమును హాసోరు మెగిద్దో గెజెరు అను పట్టణములను కట్టించుటకు సొలొమోను వెట్టివారిని పెట్టెను.