యెహోషువ 15: 19
క్రాస్-రిఫరెన్స్‌లు
" అందుకామెనాకు దీవెన దయచేయుము; నీవు నాకు దక్షిణభూమి యిచ్చి యున్నావు గనుక నీటి మడుగులను నాకు దయచేయుమనగా అతడు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
ఆమె తన పెనిమిటి యింట ప్రవేశించినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడుగుటకు అతనిని ప్రేరేపించెను. ఆమె గాడిదను దిగగా కాలేబునీకేమి కావలెనని యడిగెను
అందుకామెదీవెన దయ చేయుము; నాకు దక్షిణ భూమి ఇచ్చియున్నావు, నీటి మడుగులను కూడ నాకు దయ చేయుమనెను. అప్పుడు కాలేబు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చెను.
నేను నీయొద్దకు తెచ్చిన కానుకను చిత్తగించి పుచ్చుకొనుము; దేవుడు నన్ను కనికరించెను; మరియు నాకు కావలసినంత ఉన్నదని చెప్పి అతని బలవంతము చేసెను గనుక అతడు దాని పుచ్చుకొని
యూదానుగూర్చి అతడిట్లనెను యెహోవా, యూదా మనవి విని, అతని ప్రజలయొద్దకు అతనిని చేర్చుము. యూదా బాహుబలము అతనికి చాలునట్లుచేసి అతని శత్రువులకు విరోధముగా నీవతనికి సహాయుడవై యుందువు.
అయితే నేను నా యేలినవాడవగు నీయొద్దకు తెచ్చిన యీ కానుకను నా యేలినవాడవగు నిన్ను వెంబడించు పనివారికి ఇప్పించి
కావున లోగడ ఇచ్చెదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక ధారాళముగా ఇయ్యవలెనని చెప్పి, సహోదరులు మీయొద్దకు ముందుగావచ్చి దానిని జమచేయుటకై వారిని హెచ్చరించుట అవసరమని తలంచితిని.
ఆ దేశమందంతటను యోబు కుమార్తెలంత సౌందర్యవతులు కనబడలేదు. వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్థ్యములనిచ్చెను.