లేఖనాలను అన్వేషించండి

యెహోషువ 22: 34

క్రాస్-రిఫరెన్స్‌లు

" రూబేనీయులును గాదీయులును యెహోవాయే దేవుడనుటకు ఇది మనమధ్యను సాక్షియగు నని దానికి ఏద అను పేరు పెట్టిరి."

సంబంధిత రిఫరెన్స్‌లు

యెహోషువ 22:27

మన దహనబలుల విషయములోను బలుల విషయములోను సమాధానబలుల విషయములోను మనము యెహోవా సన్నిధిని ఆయన సేవచేయవలయు ననుటకుయెహోవాయందు మీకు పాలు ఏదియు లేదను మాట మీ సంతతివారు మా సంతతివారికి చెప్పజాలకుండు నట్లు అది మాకును మీకును మన తరువాత మన మన తరములవారికిని మధ్య సాక్షియైయుండును.

యెహోషువ 24:27

జను లందరితో ఇట్లనెనుఆలోచించుడి, యెహోవా మనతో చెప్పిన మాటలన్నియు ఈ రాతికి వినబడెను గనుక అది మనమీద సాక్షిగా ఉండును. మీరు మీ దేవుని విసర్జించినయెడల అది మీమీద సాక్షిగా ఉండును.

1రాజులు 18:39

అంతట జనులందరును దాని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలువేసిరి.

యెషయా 43:10

మీరు తెలిసికొని నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించునట్లు మీరును నేను ఏర్పరచుకొనిన నా సేవకుడును నాకు సాక్షులు నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు నా తరువాత ఏ దేవుడు నుండడు.

మత్తయి 4:10

యేసు వానితో సాతానా, పొమ్ము ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడి యున్నదనెను.

యెషయా 19:20

అది ఐగుప్తుదేశములో సైన్యములకధిపతియగు యెహోవాకు సూచనగాను సాక్ష్యార్థముగాను ఉండును. బాధకులనుగూర్చి వారు యెహోవాకు మొఱ్ఱపెట్టగా ఆయన వారి నిమిత్తము శూరుడైన యొక రక్షకుని పంపును అతడు వారిని విమోచించును.