న్యాయాధిపతులు 13: 6
క్రాస్-రిఫరెన్స్‌లు
" ఆ స్త్రీ తన పెనిమిటియొద్దకు వచ్చి దైవజనుడొకడు నాయొద్దకు వచ్చెను; అతని రూపము దేవదూత రూపమును పోలినదై మిక్కిలి భీకరముగా ఉండెను. అతడు ఎక్కడనుండి వచ్చెనో నేనడుగలేదు, అతడు తనపేరు నాతోచెప్పలేదు"
సంబంధిత రిఫరెన్స్‌లు
దైవజనుడైన మోషే మృతినొందకమునుపు అతడు ఇశ్రాయేలీయులను దీవించిన విధము ఇది; అతడిట్లనెను యెహోవా సీనాయినుండి వచ్చెను
యూదా వంశస్థులు గిల్గాలులో యెహోషువయొద్దకు రాగా కెనెజీయుడగు యెఫున్నె కుమారుడైన కాలేబు అతనితో ఈలాగు మనవిచేసెనుకాదేషు బర్నేయలో దైవజనుడైన మోషేతో యెహోవా నన్నుగూర్చియు నిన్నుగూర్చియు చెప్పినమాట నీ వెరుగుదువు.
అంతట దైవజనుడొకడు ఏలీ యొద్దకు వచ్చి యిట్లనెను యెహోవా నిన్నుగూర్చి సెలవిచ్చినదేమనగా, నీ పితరుని యింటివారు ఐగుప్తు దేశమందు ఫరో యింటిలో ఉండగా నేను వారికి ప్రత్యక్షమైతిని.
వాడు ఇదిగో ఈ పట్టణములో దైవజనుడు ఒకడున్నాడు, అతడు బహు ఘనుడు, అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును. మనము వెళ్లవలసిన మార్గమును అతడు మనకు తెలియజేయునేమో అతని యొద్దకు వెళ్లుదము రండని చెప్పెను.
ఆమె ఏలీయాతో దైవజనుడా, నాయొద్దకు నీవు రానిమిత్తమేమి? నా పాపమును నాకు జ్ఞాపకముచేసి నా కుమారుని చంపుటకై నాయొద్దకు వచ్చితివా అని మనవిచేయగా
ఆ స్త్రీ ఏలీయాతో నీవు దైవజనుడవై యున్నావనియు నీవు పలుకుచున్న యెహోవామాట నిజమనియు ఇందుచేత నేనెరుగుదుననెను.
కాగా ఆమె తన పెనిమిటిని చూచి మనయొద్దకు వచ్చుచు పోవుచున్నవాడు భక్తిగల దైవజనుడని నేనెరుగుదును.
ఆమె వచ్చి ద్వారమందు నిలువగా ఎలీషా మరుసటి యేట ఈ రుతువున నీ కౌగిట కుమారుడుండునని ఆమెతో అనెను. ఆమె ఆ మాట విని దైవజనుడవైన నా యేలినవాడా, ఆలాగు పలుకవద్దు; నీ దాసురాలనైన నాతో అబద్ధమాడవద్దనెను.
దైవజనుడా, నీవైతే వీటివి విసర్జించి, నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము.
ఆ దూత స్వరూపము మెరుపువలె నుండెను, అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను.
ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను; ఆయన వస్త్రములు తెల్లనివై ధగధగ మెరిసెను.
సభలో కూర్చున్నవారందరు అతనివైపు తేరిచూడగా అతని ముఖము దేవదూత ముఖమువలె వారికి కనబడెను.
ఆయన యెహోవా దూత అని మానోహ తెలిసికొనిమనము దేవుని చూచితివిు గనుక మనము నిశ్చయముగా చనిపోదుమని తన భార్యతో అనగా
యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు; అది నాకు తెలియకపోయెననుకొని
భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము. ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు;
ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్నివలన ఆ పొద మండుచుండెను. గాని పొద కాలిపోలేదు.
మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను, అబ్రాహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవునివైపు చూడ వెరచెను.
అప్పుడతడు నేను నిలుచున్న చోటునకు వచ్చెను; అతడు రాగానే నేను మహా భయమొంది సాష్టాంగపడితిని; అతడు నరపుత్రుడా, యీ దర్శనము అంత్యకాలమునుగూర్చినదని తెలిసికొనుమనెను.
నేను కన్నులెత్తి చూడగా, నారబట్టలు ధరించుకొన్న యొకడు కనబడెను, అతడు నడుమున మేలిమి బంగారు నడికట్టు కట్టుకొనియుండెను.
దానియేలూ, నీవు బహు ప్రియుడవు గనుక నేను నీయొద్దకు పంపబడితిని; నీవు లేచి నిలువబడి నేను నీతో చెప్పుమాటలు తెలిసికొనుమనెను. అతడీమాటలు నాతో చెప్పగా నేను వణకుచు నిలువబడితిని.
అతనికి భయపడుటవలన కావలివారు వణకి చచ్చినవారివలె నుండిరి.
నేనాయనను చూడగానే చచ్చినవానివలె ఆయన పాదములయొద్ద పడితిని. ఆయన తన కుడిచేతిని నామీద ఉంచి నాతో ఇట్లనెను భయపడకుము;
మానోహనీ మాటలు నెరవేరిన తరువాత మేము నిన్ను సన్మానించునట్లు నీ పేరేమని యెహోవా దూతను అడుగగా
యెహోవా దూతనీ వేల నాపేరు అడుగుచున్నావు? అది చెప్పశక్యముకాని దనెను.
అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపుమనెను. అందుకాయననీవు ఎందునిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతని నాశీర్వదించెను.
దూత నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును; నీతో మాటలాడుటకును ఈ సువర్తమానము నీకు తెలుపుటకును పంపబడితిని.
మోషే చిత్తగించుము; నేను ఇశ్రాయేలీయుల యొద్దకు వెళ్లి వారిని చూచి మీ పితరుల దేవుడు మీయొద్దకు నన్ను పంపెనని వారితో చెప్పగా వారు ఆయన పేరేమి అని అడిగినయెడల వారితో నేనేమి చెప్పవలెనని దేవుని నడిగెను.
నీవెక్కడనుండి వచ్చితివని యేసును అడిగెను; అయితే యేసు అతనికి ఏ ఉత్తరము ఇయ్యలేదు
పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొనియున్న వీరెవరు? ఎక్కడనుండి వచ్చిరని నన్ను అడిగెను.