న్యాయాధిపతులు 16: 22
క్రాస్-రిఫరెన్స్‌లు
" అతడు బందీగృహములో తిరగలి విసరువాడాయెను. అయితే అతడు క్షౌరము చేయబడిన తరువాత అతని తలవెండ్రుకలుతిరిగి మొలుచుటకు మొదలు పెట్టెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
అయితే వారు తమ శత్రువుల దేశములో ఉన్నప్పుడు వారిని నిరాకరింపను; నా నిబంధనను భంగపరచి వారిని కేవలము నశింపజేయునట్లు వారియందు అసహ్యపడను. ఏలయనగా నేను వారి దేవుడనైన యెహోవాను.
వారికాధారము లేకపోవును.
అయినను వారి రోదనము తనకు వినబడగా వారికి కలిగిన శ్రమను ఆయన చూచెను.
వారిని తలంచుకొని ఆయన తన నిబంధనను జ్ఞాపకము చేసికొనెను తన కృపాబాహుళ్యమునుబట్టి వారిని కరుణించెను.
కష్టకాలమందు వారు యెహోవాకు మొఱ్ఱపెట్టిరి ఆయన వారి ఆపదలలోనుండి వారిని విడిపించెను
వారి కట్లను తెంపివేసి చీకటిలోనుండియు మరణాంధకారములోనుండియు వారిని రప్పించెను.
దాను త్రోవలో సర్పముగాను దారిలో కట్లపాముగాను ఉండును. అది గుఱ్ఱపు మడిమెలు కరచును అందువలన ఎక్కువాడు వెనుకకు పడును.
ఆ మనుష్యులు ఇంటికి వచ్చుచుండగా కొందరువచ్చి వారిని గూర్చిన వార్త దావీదునకు తెలియజేసిరి; వారు బహు లజ్జాక్రాంతులై యుండిరిగనుక వారికి ఎదురుగా మనుష్యులను పంపి మీ గడ్డములు పెరుగుదనుక మీరు యెరికోలో ఉండి తరువాత రండని రాజు వారికి వర్తమానమంపెను.