న్యాయాధిపతులు 19: 9
క్రాస్-రిఫరెన్స్‌లు
" ఆ మనుష్యుడు తానును అతని ఉపపత్నియు అతని దాసుడును వెళ్ల లేచినప్పుడు ఆ చిన్నదాని తండ్రియగు అతని మామఇదిగో ప్రొద్దు గ్రుంకుటకు సమీపమాయెను, నీవు దయచేసి యీ రాత్రి యిక్కడ ఉండుము, ఇదిగో ప్రొద్దు గ్రుంకుచున్నది, సంతోషించి యిక్కడ రాత్రి గడుపుము, రేపు నీ గుడారమునకు వెళ్లుటకు నీవు వేకువనే లేచి నీ త్రోవను పోవచ్చునని అతనితో చెప్పినను"
సంబంధిత రిఫరెన్స్‌లు
వారు సాయంకాలము కావచ్చినది, ప్రొద్దుగ్రుంకినది, మాతోకూడ ఉండుమని చెప్పి, ఆయనను బలవంతముచేసిరి గనుక ఆయన వారితోకూడ ఉండుటకు లోపలికి వెళ్లెను.
ఆమెతో యుద్ధమునకు సిద్ధపరచుకొనుడి; లెండి, మధ్యాహ్నమందు బయలుదేరుదము. అయ్యో, మనకు శ్రమ, ప్రొద్దు గ్రుంకుచున్నది, సాయంకాలపు ఛాయలు పొడుగవుచున్నవి.
రేపటి దినమునుగూర్చి అతిశయపడకుము ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు.
నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్లి అక్కడ ఒక సంవత్సరముండి వ్యాపారము చేసి లాభము సంపాదింతము రండని చెప్పుకొనువారలారా,
రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవమేపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటివారే.
తరువాత మోషే తన మామను పంపివేయగా అతడు తన స్వదేశమునకు వెళ్లెను.
వారి హృదయములు సంతోషముతో నిండియుండగా వారుమనము పరిహాసము చేయుటకు సమ్సోనును పిలిపించుదము రండని సమ్సోనును బందీ గృహమునుండి పిలువనంపిరి. వారు అతని చూచి గుడి స్తంభముల మధ్యను అతని నిలువ బెట్టి పరిహాసముచేయగా
తన అల్లునితో అనగా, వారిద్దరు కూర్చుండి అన్న పానములు పుచ్చుకొనిరి. తరువాత ఆ చిన్నదాని తండ్రిదయచేసి యీ రాత్రి అంతయు ఉండి సంతోషపడుము, నీ హృదయమును సంతోషపరచుకొనుము అని ఆ మను ష్యునితో చెప్పి
అంతలో అబ్షాలోము తన పనివారిని పిలిచి, అమ్నోను ద్రాక్షారసమువలన సంతోషియై యుండుట మీరు కనిపెట్టియుండి అమ్నోనును హతము చేయుడని నేను మీతో చెప్పునప్పుడు భయపడక అతని చంపుడి, నేను గదా మీకు ఆజ్ఞ ఇచ్చియున్నాను, ధైర్యము తెచ్చుకొని పౌరుషము చూపుడి అని గట్టిగా ఆజ్ఞ ఇచ్చెను.