లేఖనాలను అన్వేషించండి

లేవీయకాండము 16: 3

క్రాస్-రిఫరెన్స్‌లు

" అతడు పాపపరిహారార్థబలిగా ఒక కోడెదూడను దహనబలిగా ఒక పొట్టేలును తీసికొని, వీటితో పరిశుద్ధస్థలములోనికి రావలెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

హెబ్రీయులకు 9:7

సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధానయాజకుడొక్కడే రక్తముచేతపట్టుకొని రెండవ గుడారములోనికి ప్రవేశించును. ఆ రక్తము తనకొరకును ప్రజల అజ్ఞానకృతముల కొరకును అతడర్పించును.

హెబ్రీయులకు 9:12

మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక, తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధస్థలములో ప్రవేశించెను.

హెబ్రీయులకు 9:24

అందువలన నిజమైన పరిశుద్ధస్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధస్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు గాని, యిప్పుడు మనకొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలొకమందే ప్రవేశించెను

హెబ్రీయులకు 9:25

అంతేకాదు, ప్రధానయాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తము తీసికొని పరిశుద్ధస్థలములోనికి ప్రవేశించినట్లు, ఆయన అనేక పర్యాయములు తన్నుతాను అర్పించుకొనుటకు ప్రవేశింపలేదు

లేవీయకాండము 4:3

ప్రజలు అపరాధులగునట్లు అభిషిక్తుడైన యాజకుడు పాపము చేసినయెడల, తాను చేసిన పాపమునకై నిర్దోషమైన కోడెదూడను యెహోవాకు పాపపరిహారార్థబలిగా అర్పింపవలెను.

లేవీయకాండము 8:14

ఇట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. అప్పుడతడు పాపపరిహారార్థబలిగా ఒక కోడెను తీసికొనివచ్చెను. అహరోనును అతని కుమారులును పాపపరిహారార్థబలి రూపమైన ఆ కోడె తలమీద తమ చేతులుంచిరి.

సంఖ్యాకాండము 29:7

ఈ యేడవ నెల పదియవ దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అప్పుడు మిమ్మును మీరు దుఃఖపరచుకొనవలెను; ఏ పనియు చేయకూడదు.

సంఖ్యాకాండము 29:8

ప్రాయశ్చిత్తము కలుగుటకై పాపపరిహారార్థబలియు నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును వాటి వాటి పానార్పణములునుగాక, మీరు ఒక కోడెదూడను ఒక పొట్టేలును ఏడాదివైన యేడు గొఱ్ఱపిల్లలను యెహోవాకు ఇంపైన సువాసనగల దహనబలిగా అర్పింపవలెను. అవి మీకున్న వాటిలో నిర్దోషమైనవై యుండవలెను.

సంఖ్యాకాండము 29:9

నూనెతో కలుపబడిన పిండిని నైవేద్యముగాను ప్రతి కోడెతో తూములో మూడు పదియవవంతులను ఒక పొట్టేలుతో రెండు పదియవవంతులను

సంఖ్యాకాండము 29:10

ఆ యేడు గొఱ్ఱపిల్లలలో ఒక్కొక్క పిల్లతో ఒక్కొక్క పదియవవంతును

సంఖ్యాకాండము 29:11

పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను.

లేవీయకాండము 1:3

అతడు దహనబలి రూపముగా అర్పించునది గోవులలోనిదైనయెడల నిర్దోషమైన మగదానిని తీసికొనిరావలెను. తాను యెహోవా సన్నిధిని అంగీకరింపబడునట్లు ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునకు దానిని తీసికొనిరావలెను.

లేవీయకాండము 1:10

దహనబలిగా అతడు అర్పించునది గొఱ్ఱలయొక్కగాని మేకలయొక్కగాని మందలోనిదైనయెడల అతడు నిర్దోషమైన మగదాని తీసికొని వచ్చి

లేవీయకాండము 8:18

తరువాత అతడు దహనబలిగా ఒక పొట్టేలును తీసికొనివచ్చెను. అహరోనును అతని కుమారులును ఆ పొట్టేలు తలమీద తమచేతులుంచిరి.

లేవీయకాండము 9:3

మరియు నీవు ఇశ్రాయేలీయులతో మీరు యెహోవా సన్నిధిని బలినర్పించునట్లు పాపపరిహారార్థబలిగా నిర్దోషమైన మేకపిల్లను, దహనబలిగా నిర్దోషమైన యేడాది దూడను గొఱ్ఱపిల్లను

నిర్గమకాండము 29:1

వారు నాకు యాజకులగునట్లు వారిని ప్రతిష్ఠించుటకు నీవు వారికి చేయవలసిన కార్యమేదనగా

నిర్గమకాండము 29:14

ఆ కోడె మాంసమును దాని చర్మమును దాని పేడను పాళెమునకు వెలుపల అగ్నితో కాల్చవలెను, అది పాపపరిహారార్థమైన బలి.

లేవీయకాండము 16:11

అప్పుడు అహరోను పాపపరిహారార్థబలియగు ఆ కోడెను తీసికొనివచ్చి తన నిమిత్తమును తన యింటివారి నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసికొనవలెను. తరువాత అతడు తనకొరకు తానర్పించు పాపపరిహారార్థబలియగు కోడెను వధించి

లేవీయకాండము 16:24

పరిశుద్ధ స్థలములో దేహమును నీళ్లతో కడుగుకొని బట్టలు తిరిగి ధరించుకొని బయటికి వచ్చి తనకొరకు దహనబలిని ప్రజలకొరకు దహనబలిని అర్పించి, తన నిమిత్తమును ప్రజల నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేయవలెను

సంఖ్యాకాండము 8:8

తమ బట్టలు ఉదుకుకొని పవిత్రపరచుకొనిన తరువాత వారు ఒక కోడెను దాని నైవేద్యమును, అనగా తైలముతో కలిసిన గోధమపిండిని తేవలెను. నీవు పాపపరిహారార్థబలిగా మరియొక కోడెను తీసికొనిరావలెను.

సంఖ్యాకాండము 29:11

పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను.