లేఖనాలను అన్వేషించండి

లేవీయకాండము 17: 9

క్రాస్-రిఫరెన్స్‌లు

" యెహోవాకు అర్పింప నుద్దేశము గలవాడై ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్దకు తీసికొని రానియెడల ఆ మనుష్యుడు జనులలోనుండి కొట్టివేయబడును."

సంబంధిత రిఫరెన్స్‌లు

లేవీయకాండము 17:4

ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్దకు దానిని ముందు తేక పాళెములో వధించినను పాళెమునకు వెలుపల వధించినను ఆ మనుష్యుడు తన ప్రజలలోనుండి కొట్టివేయబడును;

నిర్గమకాండము 30:33

దానివంటిది కలుపువాడును అన్యునిమీద దానిని పోయువాడును తన ప్రజలలోనుండి కొట్టివేయబడవలెనని చెప్పుము.

యెహోషువ 22:11

అప్పుడు రూబే నీయులును గాదీయులును మనష్షే అర్ధగోత్రపు వారును ఇశ్రాయేలీయుల యెదుటివైపున యొర్దానుప్రదేశ ములో కనానుదేశము నెదుట బలిపీఠమును కట్టిరని ఇశ్రాయేలీయులకు వర్తమానము వచ్చెను.

యెహోషువ 22:15

వారు గిలాదుదేశములోనున్న రూబేనీయులయొద్దకును గాదీయులయొద్దకును మనష్షే అర్ధ గోత్రపువారియొద్ద కును పోయి వారితో ఇట్లనిరి

యెహోషువ 22:19

మీ స్వాస్థ్యమైన దేశము అపవిత్ర ముగా నుండినయెడల యెహోవా మందిరముండు యెహోవా స్వాధీన దేశమునకు మీరు వచ్చి మా మధ్యను స్వాస్థ్యము తీసికొనుడి, మన దేవుడైన యెహోవా బలి పీఠము గాక వేరొక బలిపీఠమును కట్టుకొని యెహోవా మీద తిరుగబడకుడి, మా మీద తిరుగబడకుడి,