లేవీయకాండము 26: 46
క్రాస్-రిఫరెన్స్‌లు
" యెహోవా మోషే ద్వారా సీనాయి కొండమీద తనకును ఇశ్రాయేలీయులకును మధ్య నియమించిన కట్టడలును తీర్పులును ఆజ్ఞలును ఇవే."
సంబంధిత రిఫరెన్స్‌లు
మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను
మరియు యెహోవా సీనాయి కొండమీద మోషేకు ఈలాగు సెలవిచ్చెను
ఇవి యెహోవా సీనాయి కొండమీద ఇశ్రాయేలీయుల కొరకు మోషేకు ఇచ్చిన ఆజ్ఞలు.
నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును
మీరు స్వాధీనపరచుకొనుటకు నీ పితరుల దేవుడైన యెహోవా నీకిచ్చిన దేశమున మీరు భూమిమీద బ్రదుకు దినములన్నిటను మీరు అనుసరించి గైకొనవలసిన కట్టడలును విధులును ఇవి.
మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలననుసరించి ఆయన మాటవిని ఆయనను సేవించి ఆయనను హత్తుకొనియుండవలెను.
ధర్మశాస్త్రము మోషేద్వారా అను గ్రహింపబడెను; కృపయు సత్యమును యేసుక్రీస్తుద్వారా కలిగెను.
మరియు యెహోవా సీనాయి కొండమీద మోషేకు ఈలాగు సెలవిచ్చెను
యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినవన్ని అహరోనును అతని కుమారులును చేసిరి.
ప్రత్యక్షపు గుడారములో సేవచేయ తగినవారని కహాతీయుల వంశములలో లెక్కింపబడినవారు వీరే; యెహోవా మోషేచేత పలికించిన మాటచొప్పున మోషే అహరోనులు వారిని లెక్కించిరి.
మాషే అహరోనులచేత నీ ప్రజలను మందవలె నడిపించితివి.
యెహోవా మందిరములోనికి తేబడిన ద్రవ్యమును బయటికి తీసికొనివచ్చినప్పుడు, మోషేద్వారా యెహోవా దయచేసిన ధర్మశాస్త్రము గల గ్రంథము యాజకుడైన హిల్కీయాకు కనబడెను.