లేవీయకాండము 8: 33
క్రాస్-రిఫరెన్స్‌లు
" మీ ప్రతిష్ఠదినములు తీరువరకు ఏడు దినములు ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్దనుండి బయలువెళ్లకూడదు; ఏడు దినములు మోషే మీ విషయములో ఆ ప్రతిష్ఠను చేయుచుండును."
సంబంధిత రిఫరెన్స్‌లు
అప్పుడు పవిత్రత పొందగోరువాడు తన బట్టలు ఉదుకుకొని తన రోమమంతటిని క్షౌరము చేసికొని నీళ్లతో స్నానముచేసి పవిత్రుడగును. తరువాత వాడు పాళెములోనికి వచ్చి తన గుడారము వెలుపల ఏడు దినములు నివసింపవలెను.
అతని కుమారులలో నెవడు అతనికి ప్రతిగా యాజకుడగునో అతడు పరిశుద్ధస్థలములో సేవ చేయుటకు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్లునప్పుడు ఏడు దినములు వాటిని వేసికొనవలెను.
నేను నీకాజ్ఞాపించిన వాటన్నిటినిబట్టి నీవు అట్లు అహరోనుకును అతని కుమారులకును చేయవలెను. ఏడు దినములు వారిని ప్రతిష్ఠపరచవలెను.
అతడు మూడవ దినమున ఆ జలముతో పాపశుద్ధి చేసికొని యేడవ దినమున పవిత్రుడగును. అయితే వాడు మూడవ దినమున పాపశుద్ధి చేసికొననియెడల ఏడవ దినమున పవిత్రుడు కాడు.
ఏడు దినములు వరుసగా పాపపరిహారార్ధబలిగా ఒక మేకపిల్లను ఒక కోడెను నిర్దోషమైన ఒక పొట్టేలును వారు సిద్ధపరచవలెను.
ఏడు దినములు యాజకులు బలిపీఠమునకు ప్రాయశ్చిత్తము చేయుచు దానిని పవిత్ర పరచుచు ప్రతిష్ఠించుచు నుండవలెను.
ఆ దినములు తీరిన తరువాత ఎనిమిదవ దినము మొదలుకొని యాజకులు బలిపీఠముమీద మీ దహనబలులను మీ సమాధానబలులను అర్పింపగా నేను మిమ్మునంగీకరించెదను; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.
ఎనిమిదవ దినమున మోషే అహరోనును అతని కుమారులను ఇశ్రాయేలీయుల పెద్దలను పిలిపించి
స్రావము గలవాడు తన స్రావమునుండి పవిత్రత పొందునప్పుడు, తన పవిత్రత విషయమై యేడు దినములు లెక్కించుకొని తన బట్టలు ఉదుకుకొని పారు నీటితో ఒడలును కడుగుకొని పవిత్రుడగును.
యాజకులు లోపల ప్రవేశించునప్పుడు పరిశుద్ధ స్థలమును విడిచి బయటి ఆవరణములోనికి పోక అక్కడనే తాము పరిచర్య చేయు వస్త్రములను ఉంచవలెను; అవి ప్రతిష్ఠితములైనవి గనుక జనుల సంబంధమైన దేనినైనను వారు ముట్టునప్పుడు వారు వేరుబట్టలు ధరించుకొనవలెను.