లేఖనాలను అన్వేషించండి

మత్తయి 11: 17

క్రాస్-రిఫరెన్స్‌లు

" మీకు పిల్లనగ్రోవి ఊదితివిు గాని మీరు నాట్యమాడరైతిరి; ప్రలాపించితివిు గాని మీరు రొమ్ముకొట్టుకొనరైతిరని తమ చెలికాండ్రతో చెప్పి పిలుపులాటలాడుకొను పిల్లకాయలను పోలియున్నారు."

సంబంధిత రిఫరెన్స్‌లు

విలాపవాక్యములు 2:13

యెరూషలేముకుమారీ, ఎట్టిమాటలచేత నిన్ను హెచ్చరించుదును? దేనితో నిన్ను సాటిచేయుదును? సీయోనుకుమారీ, కన్యకా, నిన్ను ఓదార్చుటకు దేనితో నిన్ను పోల్చుదును? నీకు కలిగిన నాశనము సముద్రమంత గొప్పది నిన్ను స్వస్థపరచగలవాడెవడు?

మార్కు 4:30

మరియు ఆయన ఇట్లనెను దేవుని రాజ్యమును ఎట్లు పోల్చెదము? ఏ ఉపమానముతో దానిని ఉపమించెదము?

లూకా 13:18

ఆయన దేవుని రాజ్యము దేనిని పోలియున్నది? దేనితో దాని పోల్తును?

మత్తయి 12:34

సర్పసంతానమా, మీరు చెడ్డవారైయుండి ఏలాగు మంచి మాటలు పలుకగలరు? హృదయమందు నిండియుండు దానినిబట్టి నోరు మాటలాడును గదా.

మత్తయి 23:36

ఇవన్నియు ఈ తరమువారిమీదికి వచ్చునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

మత్తయి 24:34

ఇవన్నియు జరుగువరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.

లూకా 7:31

కాబట్టి యీ తరము మనుష్యులను నేను దేనితో పోల్చుదును, వారు దేనిని పోలియున్నారు?

లూకా 7:32

సంతవీధులలో కూర్చుండియుండి మీకు పిల్లనగ్రోవి ఊదితివిు గాని మీరు నాట్యమాడరైతిరి; ప్రలాపించితివిు గాని మీరేడ్వ రైతిరి అని యొకనితో ఒకడు చెప్పుకొని పిలుపులాట లాడుకొను పిల్లకాయలను పోలియున్నారు.

లూకా 7:33

బాప్తిస్మమిచ్చు యోహాను, రొట్టె తినకయు ద్రాక్షారసము త్రాగకయు వచ్చెను గనుక వీడు దయ్యము పట్టినవాడని మీరనుచున్నారు.

లూకా 7:34

మనుష్యకుమారుడు తినుచును, త్రాగుచును వచ్చెను గనుక మీరు ఇదిగో వీడు తిండిపోతును మద్యపానియు, సుంకరులకును పాపులకును స్నేహితుడును అనుచున్నారు.

లూకా 7:35

అయినను జ్ఞానము జ్ఞానమని దాని సంబంధులందరినిబట్టి తీర్పుపొందుననెను.

ద్వితియోపదేశాకాండము 32:20

ఆయన ఇట్లనుకొనెను నేను వారికి విముఖుడనై వారి కడపటిస్థితి యేమగునో చూచెదను వారు మూర్ఖచిత్తము గలవారు విశ్వాసములేని పిల్లలు.

జెకర్యా 8:5

ఆ పట్టణపు వీధులు ఆటలాడు మగ పిల్లలతోను ఆడుపిల్లలతోను నిండియుండును.

మత్తయి 20:3

తరువాత అతడు దాదాపు తొమ్మిది గంటలకు వెళ్లి సంతవీధిలో ఊరక నిలిచియున్న మరికొందరిని చూచి

లూకా 7:32

సంతవీధులలో కూర్చుండియుండి మీకు పిల్లనగ్రోవి ఊదితివిు గాని మీరు నాట్యమాడరైతిరి; ప్రలాపించితివిు గాని మీరేడ్వ రైతిరి అని యొకనితో ఒకడు చెప్పుకొని పిలుపులాట లాడుకొను పిల్లకాయలను పోలియున్నారు.