లేఖనాలను అన్వేషించండి

మత్తయి 17: 25

క్రాస్-రిఫరెన్స్‌లు

" అతడు ఇంటిలోనికి వచ్చి మాటలాడకమునుపే యేసు ఆ సంగతి యెత్తి సీమోనా, నీకేమి తోచుచున్నది? భూరాజులు సుంకమును పన్నును ఎవరియొద్ద వసూలుచేయుదురు? కుమారులయొద్దనా అన్యులయొద్దనా? అని అడిగెను"

సంబంధిత రిఫరెన్స్‌లు

మార్కు 9:33

అంతట వారు కపెర్నహూమునకు వచ్చిరి. వారు ఎవడు గొప్పవాడని మార్గమున ఒకనితో ఒకడు వాదించిరి గనుక

నిర్గమకాండము 30:13

వారు ఇయ్యవలసినది ఏమనగా, లెక్కింపబడినవారిలో చేరు ప్రతివాడును పరిశుద్ధస్థలముయొక్క తులమునుబట్టి అరతులము ఇయ్యవలెను. ఆ తులము యిరువది చిన్నములు. ఆ అరతులము యెహోవాకు ప్రతిష్ఠార్పణ.

నిర్గమకాండము 38:26

ఈ పన్ను ఇరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి లెక్కలో చేరిన వారందరిలో, అనగా ఆరులక్షల మూడువేల ఐదువందల ఏబది మందిలో తలకొకటికి అరతులము.

2దినవృత్తాంతములు 24:9

మరియు దేవుని సేవకుడైన మోషే అరణ్యమందు ఇశ్రాయేలీయులకు నిర్ణయించిన కానుకను యెహోవా యొద్దకు జనులు తేవలెనని యూదాలోను యెరూషలేములోను వారు చాటించిరి.

నెహెమ్యా 10:32

మరియు మన దేవుని మందిరపు సేవ నిమిత్తము ప్రతి సంవత్సరము తులము వెండిలో మూడవ వంతు ఇచ్చెదమని నిబంధన చేసికొంటిమి.

మత్తయి 4:13

నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలియను దేశముల ప్రాంతములలో సముద్రతీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను.

మత్తయి 11:23

కపెర్నహూమా, ఆకాశము మట్టునకు హెచ్చింపబడెదవా? నీవు పాతాళమువరకు దిగిపోయెదవు. నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడినయెడల అది నేటివరకు నిలిచియుండును.

మత్తయి 26:17

పులియని రొట్టెల పండుగలో మొదటి దినమందు, శిష్యులు యేసునొద్దకు వచ్చి పస్కాను భుజించుటకు మేము నీకొరకు ఎక్కడ సిద్ధపరచగోరుచున్నావని అడిగిరి.

లూకా 9:50

అందుకు యేసు మీరు వాని నాటంకపరచకుడి? మీకు విరోధి కానివాడు మీ పక్షమున నున్నవాడే అని అతనితో చెప్పెను.

రోమీయులకు 13:6

ఏలయనగా వారు దేవుని సేవకులైయుండి యెల్లప్పుడు ఈ సేవయందే పని కలిగియుందురు.