మత్తయి 24: 38
క్రాస్-రిఫరెన్స్‌లు
" జలప్రళయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్లిన దినమువరకు, వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసికొనుచు పెండ్లికిచ్చుచునుండి"
సంబంధిత రిఫరెన్స్‌లు
నూటఏబది దినముల వరకు నీళ్లు భూమిమీద ప్రచండముగా ప్రబలెను.
పూర్వమునుండి దుష్టులు అనుసరించిన మార్గమును నీవు అనుసరించెదవా?
వారు అకాలముగా ఒక నిమిషములో నిర్మూలమైరివారి పునాదులు జలప్రవాహమువలె కొట్టుకొనిపోయెను.
ఆయన మంచి పదార్థములతో వారి యిండ్లను నింపినను
నోవహు దినములలో జరిగినట్టు మనుష్యకుమారుని దినములలోను జరుగును.
నోవహు ఓడలోనికి వెళ్లిన దినమువరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికియ్యబడుచు నుండిరి; అంతలో జలప్రళయము వచ్చి వారినందరిని నాశనము చేసెను.
విశ్వాసమునుబట్టి నోవహు అదివరకు చూడని సంగతులనుగూర్చి దేవునిచేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై, తన యింటివారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను; అందువలన అతడు లోకముమీద నేరస్థాపన చేసి విశ్వాసమునుబట్టి కలుగు నీతికి వారసుడాయెను.
దేవుని దీర్ఘశాంతము ఇంక కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా, అవిధేయులైన వారియొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మలయొద్దకు, ఆయన ఆత్మరూపిగానే వెళ్లి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా ఎనిమిది మంది నీటిద్వారా రక్షణ పొందిరి.
దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది; అదేదనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు గాని యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే.
మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక, భక్తిహీనుల సమూహము మీదికి జలప్రళయమును రప్పించినప్పుడు, నీతిని ప్రకటించిన నోవహును మరి యేడుగురిని కాపాడెను.
ఆ నీళ్లవలన అప్పుడున్న లోకము నీటివరదలో మునిగి నశించెను.
భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మనచేతుల కష్టము విషయములోను మన పని విషయములోను ఇతడు మనకు నెమ్మది కలుగజేయుననుకొని అతనికి నోవహు అని పేరు పెట్టెను
యెహోవా ఈ తరమువారిలో నీవే నా యెదుట నీతిమంతుడవై యుండుట చూచితిని గనుక నీవును నీ యింటివారును ఓడలో ప్రవేశించుడి.
నరులతోకూడ పశువులును పురుగులును ఆకాశపక్షులును నేలమీదనున్న జీవరాసులన్నియు తుడిచివేయబడెను. అవి భూమిమీద నుండకుండ తుడిచివేయబడెను. నోవహును అతనితోకూడ ఆ ఓడలో నున్నవియు మాత్రము మిగిలియుండెను.
నోవహు షేము హాము యాపెతు.
వారు అకాలముగా ఒక నిమిషములో నిర్మూలమైరివారి పునాదులు జలప్రవాహమువలె కొట్టుకొనిపోయెను.
లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమియులేదని చెప్పుకొనుచుండగా, గర్భిణి స్త్రీకి ప్రసవవేదన వచ్చునట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు