లేఖనాలను అన్వేషించండి

మత్తయి 27: 34

క్రాస్-రిఫరెన్స్‌లు

" చేదు కలిపిన ద్రాక్షారసమును ఆయనకు త్రాగనిచ్చిరి గాని ఆయన దానిని రుచి చూచి త్రాగనొల్లకపోయెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

మార్కు 15:22

అతడు అలెక్సంద్రునకును రూఫునకును తండ్రి. వారు గొల్గొతా అనబడిన చోటునకు ఆయనను తీసికొనివచ్చిరి. గొల్గొతా అనగా కపాలస్థలమని అర్థము.

లూకా 23:27

గొప్ప జనసమూహమును, ఆయననుగూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలమంది స్త్రీలును ఆయనను వెంబడించిరి.

లూకా 23:28

యేసు వారివైపు తిరిగి యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడ్వకుడి; మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడ్వుడి.

లూకా 23:29

ఇదిగో గొడ్రాండ్రును కనని గర్భములును పాలియ్యని స్తనములును ధన్యములైనవని చెప్పు దినములు వచ్చుచున్నవి.

లూకా 23:30

అప్పుడు మామీద పడుడని పర్వతములతోను, మమ్ము కప్పుడని కొండలతోను జనులు చెప్పసాగుదురు.

లూకా 23:31

వారు పచ్చి మ్రానుకే యీలాగు చేసినయెడల ఎండినదానికేమి చేయుదురో అని చెప్పెను.

లూకా 23:32

మరి యిద్దరు ఆయనతో కూడ చంపబడుటకు తేబడిరి; వారు నేరము చేసినవారు.

లూకా 23:33

వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని ఎడమవైపున ఒకనిని ఆ నేరస్థులను ఆయనతో కూడ సిలువవేసిరి.

యోహాను 19:17

వారు యేసును తీసికొనిపోయిరి. ఆయన తన సిలువ మోసికొని కపాలస్థలమను చోటికి వెళ్లెను. హెబ్రీ బాషలో దానికి గొల్గొతా అని పేరు.

లూకా 23:33

వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని ఎడమవైపున ఒకనిని ఆ నేరస్థులను ఆయనతో కూడ సిలువవేసిరి.