మీకా 6: 1
క్రాస్-రిఫరెన్స్‌లు
" యెహోవా సెలవిచ్చు మాట ఆలకించుడి నీవువచ్చి పర్వతములను సాక్ష్యముపెట్టి వ్యాజ్యెమాడుము, కొండలకు నీ స్వరము వినబడనిమ్ము."
సంబంధిత రిఫరెన్స్‌లు
యాకోబు సంతతిలో శేషించినవారు అన్యజనుల మధ్యను అనేక జనములలోను అడవిమృగములలో సింహమువలెను, ఎవడును విడిపింపకుండ లోపలికి చొచ్చి గొఱ్ఱల మందలను త్రొక్కి చీల్చు కొదమసింహమువలెను ఉందురు.
అన్యజనులకు ప్రతిదండన చేయుటకును ప్రజలను శిక్షించుటకును
మిమ్మును శ్రమపరచువారికి శ్రమయు, శ్రమపొందుచున్న మీకు మాతోకూడ విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే.
యెహోవా లెమ్ము, నరులు ప్రబలకపోవుదురు గాక నీ సన్నిధిని జనములు తీర్పు పొందుదురు గాక.
యెహోవా దినము అన్యజనులందరి మీదికి వచ్చుచున్నది. అప్పుడు నీవు చేసినట్టే నీకును చేయబడును, నీవు చేసినదే నీ నెత్తిమీదికి వచ్చును.
ఆయన మధ్యవర్తియై అనేక జనములకు న్యాయము తీర్చును, దూరమున నివసించు బలము గల అన్యజనులకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ యీటెలను మచ్చుకత్తులుగాను సాగకొట్టుదురు, జనము మీదికి జనము ఖడ్గము ఎత్తక యుండును, యుధ్దముచేయ నేర్చుకొనుట జనులు ఇక మానివేతురు.
యెహోవా రోషము గలవాడై ప్రతికారము చేయువాడు, యెహోవా ప్రతికారము చేయును; ఆయన మహోగ్రత గలవాడు, యెహోవా తన శత్రువులకు ప్రతికారము చేయును, తనకు విరోధులైన వారిమీద కోపముంచుకొనును.
రాజ్యముల సింహాసనములను నేను క్రింద పడవేతును; అన్యజనుల రాజ్యములకు కలిగిన బలమును నాశనముచేతును; రథములను వాటిని ఎక్కిన వారిని క్రింద పడవేతును; గుఱ్ఱములును రౌతులును ఒకరి ఖడ్గముచేత ఒకరు కూలుదురు.
ఆ దినమందు నేను యెరూషలేమును సమస్తమైన జనులకు బరువైన రాయిగాచేతును, దానిని ఎత్తి మోయువారందరు మిక్కిలి గాయపడుదురు, భూజనులందరును దానికి విరోధులై కూడుదురు.