లేఖనాలను అన్వేషించండి

నహూము 2: 8

క్రాస్-రిఫరెన్స్‌లు

" కట్టబడినప్పటినుండి నీనెవె పట్టణము నీటికొలనువలె ఉండెను; దాని జనులు పారిపోవుచున్నారు; నిలువుడి నిలువుడి అని పిలిచినను తిరిగిచూచు వాడొకడును లేడు."

సంబంధిత రిఫరెన్స్‌లు

యెషయా 38:14

మంగలకత్తి పిట్టవలెను ఓదెకొరుకువలెను నేను కిచకిచలాడితిని గువ్వవలె మూల్గితిని ఉన్నత స్థలముతట్టు చూచి చూచి నాకన్నులు క్షీణించెను నాకు శ్రమ కలిగెను; యెహోవా, నాకొరకు పూటబడియుండుము.

యెషయా 59:11

మేమందరము ఎలుగుబంట్లవలె బొబ్బరించుచున్నాము గువ్వలవలె దుఃఖరవము చేయుచున్నాము న్యాయముకొరకు కాచుకొనుచున్నాము గాని అది లభించుటలేదు రక్షణకొరకు కాచుకొనుచున్నాము గాని అది మాకు దూరముగా ఉన్నది

లూకా 23:27

గొప్ప జనసమూహమును, ఆయననుగూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలమంది స్త్రీలును ఆయనను వెంబడించిరి.

లూకా 23:48

చూచుటకై కూడివచ్చిన ప్రజలందరు జరిగిన కార్యములు చూచి, రొమ్ము కొట్టుకొనుచు తిరిగివెళ్లిరి.