లేఖనాలను అన్వేషించండి

నెహెమ్యా 13: 25

క్రాస్-రిఫరెన్స్‌లు

" అంతట నేను వారితో వాదించి వారిని శపించి కొందరిని కొట్టి వారి తలవెండ్రుకలను పెరికివేసి మీరు వారి కుమారులకు మీ కుమార్తెలను ఇయ్యకయు, మీ కుమారులకైనను మీకైనను వారి కుమార్తెలను పుచ్చుకొనకయు ఉండవలెనని వారిచేత దేవుని పేరట ప్రమాణము చేయించి"

సంబంధిత రిఫరెన్స్‌లు

నెహెమ్యా 13:11

నేను అధిపతులతో పోరాడి దేవుని మందిరమును ఎందుకు లక్ష్యపెట్టలేదని అడిగి, వారిని సమకూర్చి తమ స్థలములలో ఉంచితిని.

నెహెమ్యా 13:17

అంతట యూదుల ప్రధానులను నేనెదురాడి విశ్రాంతిదినమును నిర్లక్ష్యపెట్టి మీరెందుకు ఈ దుష్కార్యమును చేయుదురు?

సామెతలు 28:4

ధర్మశాస్త్రమును త్రోసివేయువారు దుష్టులను పొగడుచుందురు ధర్మశాస్త్రము ననుసరించువారు వారితో పోరాడుదురు.

నెహెమ్యా 5:13

మరియు నేను నా ఒడిని దులిపి ఈ ప్రకారమే దేవుడు ఈ వాగ్దానము నెరవేర్చని ప్రతివానిని తన యింటిలో ఉండకయు తన పని ముగింపకయు నుండునట్లు దులిపివేయును; ఇటువలె వాడు దులిపివేయబడి యేమియు లేనివాడుగా చేయబడునుగాకని చెప్పగా, సమాజకులందరు ఆలాగు కలుగునుగాక అని చెప్పి యెహోవాను స్తుతించిరి. జనులందరును ఈ మాట చొప్పుననే జరిగించిరి.

ద్వితియోపదేశాకాండము 27:14

అప్పుడు లేవీయులు యెహోవాకు హేయముగా శిల్పిచేతులతో

ద్వితియోపదేశాకాండము 27:15

మలిచిన విగ్రహమునేగాని పోతవిగ్రహమునేగాని చేసి చాటున నుంచువాడు శాపగ్రస్తుడని యెలుగెత్తి ఇశ్రాయేలీయులందరితోను చెప్పగా ఆమేన్‌ అనవలెను.

ద్వితియోపదేశాకాండము 27:16

తన తండ్రినైనను తన తల్లినైనను నిర్లక్ష్యము చేయువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరు ఆమేన్‌ అనవలెను.

ద్వితియోపదేశాకాండము 27:17

తన పొరుగువాని సరిహద్దురాయిని తీసివేయు వాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరుఆమేన్‌ అనవలెను.

ద్వితియోపదేశాకాండము 27:18

గ్రుడ్డివాని త్రోవను తప్పించువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరు ఆమేన్‌ అనవలెను.

ద్వితియోపదేశాకాండము 27:19

పరదేశికేగాని తండ్రిలేనివానికేగాని విధవరాలికేగాని న్యాయము తప్పి తీర్పు తీర్చువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరు ఆమేన్‌ అనవలెను.

ద్వితియోపదేశాకాండము 27:20

తన తండ్రి భార్యతో శయనించువాడు తన తండ్రి కోకను విప్పినవాడు గనుక వాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరు ఆమేన్‌ అనవలెను.

ద్వితియోపదేశాకాండము 27:21

ఏ జంతువుతోనైనను శయనించువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరు ఆమేన్‌ అనవలెను.

ద్వితియోపదేశాకాండము 27:22

తన సహోదరితో, అనగా తన తండ్రికుమార్తెతోగాని తన తల్లికుమార్తెతోగాని శయనించువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరు ఆమేన్‌ అనవలెను.

ద్వితియోపదేశాకాండము 27:23

తన అత్తతో శయనించువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరు ఆమేన్‌ అనవలెను.

ద్వితియోపదేశాకాండము 27:24

చాటున తన పొరుగువానిని కొట్టువాడు శాపగ్రస్తు డని చెప్పగా ప్రజలందరు ఆమేన్‌ అనవలెను.

ద్వితియోపదేశాకాండము 27:25

నిర్దోషికి ప్రాణహాని చేయుటకు లంచము పుచ్చుకొనువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరు ఆమేన్‌ అనవలెను.

ద్వితియోపదేశాకాండము 27:26

ఈ విధికి సంబంధించిన వాక్యములను గైకొనకపోవుటవలన వాటిని స్థిరపరచనివాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరు ఆమేన్‌ అనవలెను.

కీర్తనలు 15:4

అతని దృష్టికి నీచుడు అసహ్యుడు అతడు యెహోవాయందు భయభక్తులు గలవారిని సన్మానించును అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు.

లూకా 11:45

అప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడొకడు బోధకుడా, యీలాగు చెప్పి మమ్మును కూడ నిందించుచున్నావని ఆయనతో చెప్పగా

లూకా 11:46

ఆయన అయ్యో, ధర్మశాస్త్రోపదేశకులారా, మోయశక్యము కాని బరువులను మీరు మనుష్యులమీద మోపుదురు గాని మీరు ఒక వ్రేలితోనైనను ఆ బరువులను ముట్టరు.

ద్వితియోపదేశాకాండము 25:2

ఆ దోషి శిక్షకు పాత్రుడుగా కనబడినయెడల న్యాయాధిపతి వాని పండుకొనబెట్టి వాని నేరముకొలది దెబ్బలు లెక్కపెట్టి తనయెదుట వాని కొట్టింపవలెను.

ద్వితియోపదేశాకాండము 25:3

నలువది దెబ్బలు కొట్టింపవచ్చును అంతకు మించకూడదు. వీటికంటే విస్తారమైన దెబ్బలు కొట్టించినయెడల నీ సహోదరుడు నీ దృష్టికి నీచుడుగా కనబడునేమో.

ఎజ్రా 7:26

నీ దేవుని ధర్మశాస్త్రము గాని, రాజుయొక్క చట్టము గాని, గైకొననివాడెవడో త్వరగా విచారణ చేసి, మరణశిక్షయైనను స్వదేశ త్యాగమైనను ఆస్తి జప్తియైనను ఖైదునైనను వానికి విధింపవలెను.

యెషయా 50:6

కొట్టువారికి నా వీపును అప్పగించితిని వెండ్రుకలు పెరికివేయువారికి నా చెంపలను అప్పగించితిని ఉమ్మివేయువారికిని అవమానపరచువారికిని నా ముఖము దాచుకొనలేదు

నెహెమ్యా 10:29

వారి భార్యలు వారి కుమారులు వారి కుమార్తెలు తెలివియు బుద్ధియుగలవారెవరో వారును ఈ విషయములో ప్రధానులైన తమ బంధువులతో కలిసిరి.

నెహెమ్యా 10:30

మరియు మేము దేశపు జనులకు మా కుమార్తెలను ఇయ్యకయు వారి కుమార్తెలను మా కుమారులకు పుచ్చుకొనకయు నుందుమనియు

ద్వితియోపదేశాకాండము 6:13

నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరట ప్రమాణము చేయవలెను.

2దినవృత్తాంతములు 15:12

పూర్ణహృదయముతోను పూర్ణాత్మతోను తమ పితరుల దేవుడైన యెహోవాయొద్ద తాము విచారణ చేయుదుమనియు

2దినవృత్తాంతములు 15:13

పిన్నలేగాని పెద్దలేగాని పురుషులేగాని స్త్రీలే గాని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాయొద్ద విచారణ చేయనివారికందరికిని మరణము విధించుదుమనియు నిష్కర్ష చేసికొనిరి.

2దినవృత్తాంతములు 15:14

వారు ఎలుగెత్తి బొబ్బలిడుచు, మేళములతోను బూరల నాదముతోను భేరీధ్వనులతోను యెహోవా సన్నిధిని ప్రమాణము చేసిరి.

2దినవృత్తాంతములు 15:15

ఈలాగు ప్రమాణము చేయబడగా యూదావారందరును సంతోషించిరి; వారు పూర్ణహృదయముతో ప్రమాణముచేసి పూర్ణమనస్సుతో ఆయనను వెదకియుండిరి గనుక యెహోవా వారికి ప్రత్యక్షమై చుట్టునున్న దేశస్థులతో యుద్ధములు లేకుండ వారికి నెమ్మది కలుగజేసెను.

ఎజ్రా 10:5

ఎజ్రా లేచి, ప్రధాన యాజకులును లేవీయులును ఇశ్రాయేలీయులందరును ఆ మాట ప్రకారము చేయునట్లుగా వారిచేత ప్రమాణము చేయించెను. వారు ప్రమాణము చేసికొనగా

నిర్గమకాండము 34:16

మరియు నీవు నీ కుమారులకొరకు వారి కుమార్తెలను పుచ్చుకొనునెడల వారి కుమార్తెలు తమ దేవతలతో వ్యభిచరించి నీ కుమారులను తమ దేవతలతో వ్యభిచరింప చేయుదురేమో.

ద్వితియోపదేశాకాండము 7:3

నీవు వారితో వియ్యమందకూడదు, వాని కుమారునికి నీ కుమార్తెనియ్యకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు.

ఆదికాండము 24:3

నేను ఎవరిమధ్య కాపురమున్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒక దానిని నా కుమారునికి పెండ్లిచేయక

న్యాయాధిపతులు 17:2

అతడు తన తల్లిని చూచినీయొద్ద నుండి తీసికొనినరూకలు, అనగా నీవు ప్రమాణముచేసి నా వినికిడిలో మాటలాడిన ఆ వెయ్యిన్ని నూరు వెండి రూకలు నాయొద్దనున్నవి. ఇదిగో నేను వాటిని తీసి కొంటినని ఆమెతో చెప్పగా అతని తల్లినా కుమారుడు యెహోవాచేత ఆశీర్వదింపబడును గాక అనెను.

1సమూయేలు 9:17

సౌలు సమూయేలునకు కనబడగానే యెహోవా ఇతడే నేను నీతో చెప్పిన మనిషి ఇదిగో ఇతడే నా జనులను ఏలునని అతనితో సెలవిచ్చెను.

2రాజులు 8:18

ఇతడు అహాబు కుమార్తెను పెండ్లి చేసికొనియుండెను గనుక అహాబు కుటుంబికులవలెనే ఇతడును ఇశ్రాయేలు రాజులు ప్రవర్తించినట్లు ప్రవర్తించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను.

2దినవృత్తాంతములు 21:6

అతడు అహాబు కుమార్తెను పెండ్లిచేసికొని అహాబు సంతతివారు నడచిన ప్రకారముగా ఇశ్రాయేలు రాజుల మార్గమందు నడచెను; అతడు యెహోవా దృష్టికి ప్రతికూలముగా ప్రవర్తించెను.

ఎజ్రా 9:3

నేను ఈ సంగతి విని నా వస్త్రమును పై దుప్పటిని చింపుకొని, నా తల వెండ్రుకలను నా గడ్డపు వెండ్రుకలను పెరికి వేసికొని విభ్రాంతిపడి కూర్చుంటిని.

నెహెమ్యా 5:6

వారి ఫిర్యాదును ఈ మాటలను నేను వినినప్పుడు మిగుల కోపపడితిని.

నెహెమ్యా 5:12

అందుకు వారు నీవు చెప్పిన ప్రకారమే యివన్నియు ఇచ్చివేసి వారియొద్ద ఏమియు కోరమనిరి. అంతట నేను యాజకులను పిలిచి ఈ వాగ్దాన ప్రకారము జరిగించుటకు వారిచేత ప్రమాణము చేయించితిని.

నెహెమ్యా 13:28

ప్రధానయాజకుడును ఎల్యాషీబు కుమారుడునైన యోయాదా కుమారులలో ఒకడు హోరోనీయుడైన సన్బల్లటునకు అల్లుడాయెను. దానినిబట్టి నేను అతని నాయొద్దనుండి తరిమితిని.

సామెతలు 24:25

న్యాయముగా తీర్పు తీర్చువారికి మేలు కలుగును క్షేమకరమైన దీవెన అట్టివారిమీదికి వచ్చును.

2కొరిందీయులకు 7:11

మీరు దేవుని చిత్త ప్రకారము పొందిన యీ దుఃఖము ఎట్టి జాగ్రతను ఎట్టి దోషనివారణకైన ప్రతివాదమును ఎట్టి ఆగ్రహమును ఎట్టి భయమును ఎట్టి అభిలాషను ఎట్టి ఆసక్తిని ఎట్టి ప్రతిదండనను మీలో పుట్టించెనో చూడుడి. ఆ కార్యమునుగూర్చి సమస్త విషయములలోను మీరు నిర్దోషులై యున్నారని ఋజువుపరచుకొంటిరి.

గలతీయులకు 1:8

మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరియొక సువార్తను మేమైనను పరలోకమునుండి వచ్చిన యొక దూతయైనను మీకు ప్రకటించినయెడల అతడు శాపగ్రస్తుడవును గాక.