లేఖనాలను అన్వేషించండి

నెహెమ్యా 2: 14

క్రాస్-రిఫరెన్స్‌లు

" తరువాత నేను బుగ్గ గుమ్మమునకు వచ్చి రాజు కోనేటికిని వెళ్లితిని గాని, నేను ఎక్కియున్న పశువు పోవుటకు ఎడము లేకపోయెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

నెహెమ్యా 3:15

అటు వెనుక మిస్పా ప్రదేశమునకు అధిపతియైన కొల్హోజె కుమారుడైన షల్లూము ధారయొక్క గుమ్మమును బాగుచేసి కట్టిన తరువాత దానికి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చెను. ఇదియుగాక దావీదు పట్టణమునుండి క్రిందకుపోవు మెట్లవరకు రాజు తోటయొద్దనున్న సిలోయము మడుగు యొక్క గోడను అతడు కట్టెను.

2రాజులు 18:17

అంతట అష్షూరు రాజు తర్తానును రబ్సారీసును రబ్షాకేనును లాకీషు పట్టణమునుండి యెరూషలేమునందున్న రాజైన హిజ్కియామీదికి బహు గొప్ప సమూహముతో పంపెను. వారు యెరూషలేముమీదికి వచ్చి చాకిరేవు మార్గమందున్న మెరకకొలను కాలువయొద్ద ప్రవేశించి నిలిచి రాజును పిలువనంపగా

2రాజులు 20:20

హిజ్కియా చేసిన యితర కార్యములనుగూర్చియు, అతని పరాక్రమమంతటినిగూర్చియు, అతడు కొలను త్రవ్వించి కాలువ వేయించి పట్టణములోనికి నీళ్లు రప్పించినదానినిగూర్చియు, యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది.

2దినవృత్తాంతములు 32:30

ఈ హిజ్కియా గిహోను కాలువకు ఎగువను కట్టవేయించి దావీదు పట్టణపు పడమటి వైపునకు దాని తెప్పించెను, హిజ్కియా తాను పూనుకొనిన సర్వప్రయత్నములయందును వృద్ధిపొందెను.

నెహెమ్యా 12:37

వారికి ఎదురుగా ఉన్న ఊట గుమ్మము దగ్గర దావీదుపురము యొక్క మెట్లమీద దావీదునగరును దాటి ప్రాకారము వెంబడి తూర్పువైపు నీటి గుమ్మము వరకు పోయిరి.

ప్రసంగి 2:6

వృక్షముల నారుమళ్లకు నీరుపారుటకై నేను చెరువులు త్రవ్వించుకొంటిని.