లేఖనాలను అన్వేషించండి

నెహెమ్యా 4: 6

క్రాస్-రిఫరెన్స్‌లు

" అయినను పని చేయుటకు జనులకు మనస్సు కలిగియుండెను గనుక మేము గోడను కట్టుచుంటిమి, అది సగము ఎత్తు కట్టబడి యుండెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

నెహెమ్యా 6:15

ఈ ప్రకారముగా ఏలూలు మాసము ఇరువది యయిదవ దినమందు, అనగా ఏబదిరెండు దినములకు ప్రాకారమును కట్టుట సమాప్తమాయెను.

1దినవృత్తాంతములు 29:3

మరియు నా దేవుని మందిముమీద నాకు కలిగియున్న మక్కువచేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించియుంచిన వస్తువులు గాక, నా స్వంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేనిచ్చెదను.

1దినవృత్తాంతములు 29:14

ఈ ప్రకారము మనఃపూర్వకముగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేనెంత మాత్రపువాడను? నా జనులెంత మాత్రపువారు? సమస్తమును నీవలననే కలిగెను గదా? నీ స్వసంపాద్యములో కొంత మేము నీకిచ్చియున్నాము.

1దినవృత్తాంతములు 29:17

నా దేవా, నీవు హృదయ పరిశోధనచేయుచు యథార్థవంతులయందు ఇష్టపడుచున్నావని నేనెరుగుదును; నేనైతే యథార్థహృదయము గలవాడనై యివి యన్నియు మనఃపూర్వకముగా ఇచ్చియున్నాను; ఇప్పుడు ఇక్కడనుండు నీ జనులును నీకు మనఃపూర్వకముగా ఇచ్చుట చూచి సంతోషించుచున్నాను.

1దినవృత్తాంతములు 29:18

అబ్రాహాము ఇస్సాకు ఇశ్రాయేలు అను మా పితరుల దేవా యెహోవా, నీ జనులు హృదయపూర్వకముగా సంకల్పించిన యీ ఉద్దేశమును నిత్యము కాపాడుము; వారి హృదయమును నీకు అనుకూలపరచుము.

2దినవృత్తాంతములు 29:36

ఈ కార్యము అప్పటికప్పుడే జరిగినందున దేవుడు జనులకు సిద్ధపరచినదానిని చూచి హిజ్కియాయును జనులందరును సంతోషించిరి.

కీర్తనలు 110:3

యుద్ధసన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు. నీ యౌవనస్థులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచువలె అరుణోదయ గర్భములోనుండి నీయొద్దకు వచ్చెదరు

2కొరిందీయులకు 8:16

మీ విషయమై నాకు కలిగిన యీ ఆసక్తినే తీతు హృదయములో పుట్టించిన దేవునికి స్తోత్రము.

2కొరిందీయులకు 8:17

అతడు నా హెచ్చరికను అంగీకరించెను గాని అతనికే విశేషాసక్తి కలిగినందున తన యిష్టము చొప్పుననే మీయొద్దకు బయలుదేరి వచ్చుచున్నాడు.

ఫిలిప్పీయులకు 2:13

ఎందుకనగా మీరు ఇచ్ఛయించుటకును కార్యసిద్ధి కలుగజేసికొనుటకును, తన దయాసంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే.

హెబ్రీయులకు 13:21

యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైనదానిని మనలో జరిగించుచు, ప్రతి మంచి విషయములోను తన చిత్తప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచును గాక. యేసుక్రీస్తుకు యుగయుగములకు మహిమ కలుగును గాక. ఆమేన్‌.

కీర్తనలు 102:14

దాని రాళ్లు నీ సేవకులకు ప్రియములు వారు దాని మంటిని కనికరించుదురు

ప్రసంగి 9:10

చేయుటకు నీచేతికి వచ్చిన యే పనినైనను నీ శక్తిలోపము లేకుండ చేయుము; నీవు పోవు పాతాళమునందు పనియైనను ఉపాయమైనను తెలివియైనను జ్ఞానమైనను లేదు.

మీకా 7:11

నీ గోడలు మరల కట్టించు దినము వచ్చుచున్నది, అప్పుడు నీ సరిహద్దు విశాలపరచబడును.

హగ్గయి 1:14

యెహోవా యూదాదేశపు అధికారియగు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు యొక్క మనస్సును, ప్రధానయాజకుడగు యెహోజాదాకు కుమారుడైన యెహోషువ మనస్సును, శేషించిన జనులందరి మనస్సును ప్రేరేపింపగా