నెహెమ్యా 5: 17
క్రాస్-రిఫరెన్స్‌లు
" భూమి సంపాదించుకొనిన వారము కాము; నా భోజనపు బల్లయొద్ద మా చుట్టునున్న అన్యజనులలో నుండి వచ్చిన వారు గాక యూదులును అధికారులును నూట ఏబదిమంది కూర్చుని యుండిరి."
సంబంధిత రిఫరెన్స్‌లు
అందుకు దావీదు నీవు భయపడవద్దు, నీ తండ్రియైన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి, నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరల ఇప్పింతును; మరియు నీవు సదాకాలము నా బల్లయొద్దనే భోజనము చేయుదువని సెలవియ్యగా
మెఫీబోషెతు యెరూషలేములో కాపురముండి సదాకాలము రాజు బల్లయొద్ద భోజనము చేయుచుండెను. అతని కాళ్లు రెండును కుంటివి.
అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలువారినందరిని, యెజెబెలు పోషించుచున్న బయలుదేవత ప్రవక్తలు నాలుగువందల ఏబదిమందిని, అషేరాదేవి1 ప్రవక్తలైన నాలుగువందల మందిని నాయొద్దకు కర్మెలు పర్వతమునకు పిలువనంపుమని చెప్పెను.
ఘనులు ఘనకార్యములు కల్పించుదురు వారు ఘనకార్యములనుబట్టి నిలుచుదురు.
పరిశుద్ధుల అవసరములలో పాలుపొందుచు, శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి.
సణుగుకొనకుండ ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి.
దేవుని నానావిధమైన కృపవిషయమై మంచి గృహనిర్వాహకులైయుండి, యొక్కొకడు కృపావరము పొందిన కొలది యొకనికొకడు ఉపచారము చేయుడి.
క్రొవ్విన యెడ్లు పదియు, విడియెడ్లు ఇరువదియు, నూరు గొఱ్ఱలును, ఇవియు గాక ఎఱ్ఱదుప్పులు దుప్పులు జింకలు క్రొవ్విన బాతులును తేబడెను.
ఆస్తి యెక్కువైనయెడల దాని భక్షించువారును ఎక్కువ అగుదురు; కన్నులార చూచుటయే గాక ఆస్తిపరునికి తన ఆస్తివలని ప్రయోజనమేమి?
అతడు ఆ దినమున కేకవేసినేను సంరక్షణకర్తనుగా ఉండనొల్లను నాయింట ఆహారమేమియు లేదు వస్త్రమేమియు లేదు నన్ను జనాధిపతిగా నియమింపరాదనును.