ఓబధ్యా 1: 14
క్రాస్-రిఫరెన్స్‌లు
" వారిలో తప్పించుకొనినవారిని సంహరించుటకు అడ్డత్రోవలలో నీవు నిలువ తగదు, శ్రమదినమందు అతనికి శేషించినవారిని శత్రువులచేతికి అప్పగింప తగదు."
సంబంధిత రిఫరెన్స్‌లు
యెహోవా నా శ్రమను లక్ష్యపెట్టునేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయునేమో.
నా యెముకలన్నియు నేను లెక్కింపగలను వారు నిదానించుచు నన్ను తేరి చూచుచున్నారు
నిమ్మళముగా ఉన్న అన్యజనులమీద నేను బహుగా కోపించుచున్నాను; ఏలయనగా నేను కొంచెము కోపపడగా కీడు చేయవలెనన్న తాత్పర్యముతో వారు సహాయులైరి.
అప్పుడు కనానుకు తండ్రియైన హాము తన తండ్రి వస్త్రహీనుడై యుండుట చూచి బయటనున్న తన యిద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపెను.
రాజైన ఆహాజు తనకు సహాయము చేయుడని అష్షూరు రాజులయొద్దకు వర్తమానము పంపెను.
పరదేశులైన ఆమె కూలి సిఫాయిలు పెంపుడు దూడలవలె ఉన్నారు వారేగదా వెనుకతట్టు తిరిగిరి యొకడును నిలువకుండ పారిపోయిరి వారికి ఆపద్దినము వచ్చియున్నది శిక్షాదినము వారికాసన్నమాయెను.
ఇశ్రాయేలును నీవు అపహాస్యాస్పదముగా ఎంచలేదా? అతడు దొంగలకు జతగాడైనట్టుగా నీవు అతనిగూర్చి పలుకునప్పుడెల్ల తల ఆడించుచు వచ్చితివి
నేను నిట్టూర్పు విడుచుట విని నన్నాదరించువాడొకడును లేడాయెను నీవు నాకు ఆపద కలుగజేసితివన్న వార్త నా విరోధులందరు విని సంతోషించుచున్నారు. నీవు చాటించిన దినమును నీవు రప్పించుదువు అప్పుడు వారు నన్ను పోలియుండెదరు.
యెహోవా అక్కడనుండినను ఆ రెండు జనములును ఆ రెండు దేశములును మనవే; మనము వాటిని స్వాధీనపరచుకొందము రండని నీవనుకొంటివే;