లేఖనాలను అన్వేషించండి

సామెతలు 10: 24

క్రాస్-రిఫరెన్స్‌లు

" భక్తిహీనుడు దేనికి భయపడునో అదే వానిమీదికి వచ్చును నీతిమంతులు ఆశించునది వారికి దొరుకును."

సంబంధిత రిఫరెన్స్‌లు

సామెతలు 14:9

మూఢులు చేయు అపరాధపరిహారార్థబలి వారిని అపహాస్యము చేయును యథార్థవంతులు ఒకరియందు ఒకరు దయచూపుదురు.

సామెతలు 15:21

బుద్ధిలేనివానికి మూఢత సంతోషకరము వివేకము గలవాడు చక్కగా ప్రవర్తించును.

సామెతలు 26:18

తెగులు అమ్ములు కొరవులు విసరు వెఱ్ఱివాడు

సామెతలు 26:19

తన పొరుగువాని మోసపుచ్చి నేను నవ్వులాటకు చేసితినని పలుకువానితో సమానుడు.

ప్రసంగి 11:9

యౌవనుడా, నీ యౌవనమందు సంతోషపడుము, నీ యౌవనకాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరికచొప్పునను నీ దృష్టియొక్క యిష్టము చొప్పునను ప్రవర్తింపుము; అయితే వీటన్నిటి నిబట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకముంచుకొనుము;

2సమూయేలు 2:14

అబ్నేరు లేచి మన యెదుట యౌవనులు మల్లచేష్టలు చేయుదురా అని యోవాబుతో అనగా యోవాబువారు చేయవచ్చుననెను.

సామెతలు 2:14

కీడుచేయ సంతోషించుదురు అతిమూర్ఖుల ప్రవర్తనయందు ఉల్లసించుదురు.

యిర్మియా 11:15

దుర్వ్యాపారము జరిగించిన నా ప్రియురాలికి నా మందిరముతో నిమిత్తమేమి? మ్రొక్కుబళ్లచేతను ప్రతిష్ఠిత మాంసము తినుటచేతను నీకు రావలసిన కీడు నీవు పోగొట్టుకొందువా? ఆలాగైతే నీవు ఉత్సహించుదువు.