లేఖనాలను అన్వేషించండి

సామెతలు 11: 14

క్రాస్-రిఫరెన్స్‌లు

" నాయకులు లేని జనులు చెడిపోవుదురు ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము."

సంబంధిత రిఫరెన్స్‌లు

సామెతలు 20:19

కొండెగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయటపెట్టును కావున వదరుబోతుల జోలికి పోకుము.

లేవీయకాండము 19:16

నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి తిరుగకూడదు, నీ సహోదరునికి ప్రాణహాని చేయ చూడకూడదు, నేను యెహోవాను.

సామెతలు 25:9

నీ పొరుగువానితో నీవు వ్యాజ్యెమాడవచ్చును గాని పరుని గుట్టు బయటపెట్టకుము.

సామెతలు 26:20

కట్టెలు లేనియెడల అగ్ని ఆరిపోవును కొండెగాడు లేనియెడల జగడము చల్లారును.

సామెతలు 26:21

వేడిబూడిదెకు బొగ్గులు అగ్నికి కట్టెలు కలహములు పుట్టించుటకు కలహప్రియుడు.

సామెతలు 26:22

కొండెగాని మాటలు రుచిగల పదార్థములవంటివి అవి లోకడుపులోనికి దిగిపోవును.

నెహెమ్యా 6:17

ఆ దినములలో యూదుల ప్రధానులు టోబీయాయొద్దకు మాటిమాటికి పత్రికలు పంపుచు వచ్చిరి; అతడును వారికి పత్రికలు పంపుచుండెను.

నెహెమ్యా 6:18

అతడు ఆరహు కుమారుడైన షెకన్యాకు అల్లుడు. ఇదియుగాక యోహానాను అను తన కుమారుడు బెరెక్యా కుమారుడైన మెషుల్లాము కుమార్తెను వివాహము చేసికొనియుండెను గనుక యూదులలో అనేకులు అతని పక్షమున నుండెదమని ప్రమాణము చేసిరి.

నెహెమ్యా 6:19

వారు నా యెదుట అతని గుణాతిశయములనుగూర్చి మాటలాడుచు వచ్చిరి, నేను చెప్పిన మాటలు ఆతనికి తెలియజేసిరి. నన్ను భయపెట్టుటకే టోబీయా పత్రికలు పంపెను.

సామెతలు 14:5

నమ్మకమైన సాక్షి అబద్ధమాడడు కూటసాక్షికి అబద్ధములు ప్రియములు.

యెహోషువ 2:14

అందుకు ఆ మనుష్యులు ఆమెతోనీవు మా సంగతి వెల్లడి చేయనియెడల మీరు చావకుండునట్లు మీ ప్రాణములకు బదులుగా మా ప్రాణమిచ్చెదము, యెహోవా ఈ దేశమును మాకిచ్చునప్పుడు నిజముగా మేము నీకు ఉపకారము చేసెద మనిరి.

యెహోషువ 2:20

నీవు మా సంగతి వెల్లడిచేసినయెడల నీవు మాచేత చేయించిన యీ ప్రమాణము విషయములో మేము దోషులము కామనిరి.

యిర్మియా 38:27

అంతట అధిపతులందరు యిర్మీయాయొద్దకు వచ్చి యడుగగా అతడు రాజు సెలవిచ్చిన మాటల ప్రకారముగా వారికుత్తరమిచ్చి ఆ సంగతి వారికి తెలియజేయనందున వారు అతనితో మాటలాడుట మానిరి.

నిర్గమకాండము 20:16

నీ పొరుగువానిమీద అబద్ధసాక్ష్యము పలుకకూడదు.

సామెతలు 12:23

వివేకియైనవాడు తన విద్యను దాచిపెట్టును అవివేక హృదయులు తమ మూఢత్వము వెల్లడి చేయుదురు.