లేఖనాలను అన్వేషించండి

సామెతలు 14: 13

క్రాస్-రిఫరెన్స్‌లు

" ఒకడు నవ్వుచుండినను హృదయమున దుఃఖముండవచ్చును. సంతోషము తుదకు వ్యసనమగును."

సంబంధిత రిఫరెన్స్‌లు

సామెతలు 12:15

మూఢుని మార్గము వాని దృష్టికి సరియైనది జ్ఞానము గలవాడు ఆలోచన నంగీకరించును.

సామెతలు 16:25

ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును అయినను తుదకు అది మరణమునకు చేరును.

సామెతలు 30:12

తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యమునుండి కడుగబడని వారి తరము కలదు.

మత్తయి 7:13

ఇరుకు ద్వారమున ప్రవేశించుడి; నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై యున్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు.

మత్తయి 7:14

జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై యున్నది, దాని కనుగొనువారు కొందరే.

లూకా 13:24

ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి; అనేకులు ప్రవేశింపజూతురు గాని వారివలన కాదని మీతో చెప్పుచున్నాను.

రోమీయులకు 6:21

అప్పటి క్రియలవలన మీకేమి ఫలము కలిగెను? వాటిని గురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతము మరణమే,

గలతీయులకు 6:3

ఎవడైనను వట్టివాడై యుండి తాను ఎన్నికైన వాడనని యెంచుకొనినయెడల తన్నుతానే మోసపరచుకొనును.

ఎఫెసీయులకు 5:6

వ్యర్థమైన మాటలవలన ఎవడును మిమ్మును మోసపరచనియ్యకుడి; ఇట్టి క్రియలవలన దేవుని ఉగ్రత అవిధేయులైనవారిమీదికి వచ్చును

యాకోబు 1:22

మీరు వినువారు మాత్రమైయుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండ, వాక్యప్రకారము ప్రవర్తించువారునై యుండుడి.

న్యాయాధిపతులు 17:6

ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజులేడు; ప్రతివాడును తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చెను.

న్యాయాధిపతులు 17:13

అంతట మీకాలేవీయుడు నాకు యాజకుడైనందున యెహోవా నాకు మేలుచేయునని యిప్పుడు నాకు తెలి యును అనెను.

న్యాయాధిపతులు 21:25

ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు; ప్రతి వాడును తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచువచ్చెను.

కీర్తనలు 1:6

నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియును దుష్టుల మార్గము నాశనమునకు నడుపును.

కీర్తనలు 119:104

నీ ఉపదేశమువలన నాకు వివేకము కలిగెను తప్పుమార్గములన్నియు నా కసహ్యములాయెను.

సామెతలు 25:8

ఆలోచన లేక వ్యాజ్యెమాడుటకు పోకుము నీ పొరుగువాడు నిన్ను అవమానపరచిదాని అంతమున ఇక నీవేమి చేయుదువని నీతో అనునేమో.

లూకా 8:18

కలిగినవానికి ఇయ్యబడును, లేనివాని యొద్దనుండి తనకు కలదని అనుకొనునది కూడ తీసివేయబడును గనుక మీరేలాగు వినుచున్నారో చూచుకొనుడని చెప్పెను.

యాకోబు 1:26

ఎవడైనను నోటికి కళ్లెము పెట్టుకొనక తన హృదయమును మోసపరచుకొనుచు భక్తి గలవాడనని అనుకొనినయెడల వాని భక్తి వ్యర్థమే.