లేఖనాలను అన్వేషించండి

సామెతలు 19: 5

క్రాస్-రిఫరెన్స్‌లు

" కూటసాక్షి శిక్ష నొందకపోడు అబద్ధములాడువాడు తప్పించుకొనడు."

సంబంధిత రిఫరెన్స్‌లు

సామెతలు 19:6

అనేకులు గొప్పవారి కటాక్షము వెదకుదురు దాతకు అందరు స్నేహితులే.

సామెతలు 19:7

బీదవాడు తన చుట్టములందరికి అసహ్యుడు అట్టివానికి స్నేహితులు మరి దూరస్థులగుదురు వాడు నిరర్థకమైన మాటలు వెంటాడువాడు.

సామెతలు 14:20

దరిద్రుడు తన పొరుగువారికి అసహ్యుడు ఐశ్వర్యవంతుని ప్రేమించువారు అనేకులు.

లూకా 15:13

కొన్నిదినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూర దేశమునకు ప్రయాణమైపోయి, అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారమువలన పాడుచేసెను.

లూకా 15:14

అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరవు రాగా వాడు ఇబ్బంది పడసాగి,

లూకా 15:15

వెళ్లి ఆ దేశస్థులలో ఒకనిచెంత జేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములలోనికి వానిని పంపెను.

సామెతలు 10:15

ధనవంతుని ఆస్తి వానికి ఆశ్రయపట్టణము దరిద్రుని పేదరికము వానికి నాశనకరము.

యోబు 6:15

నా స్నేహితులు ఎండిన వాగువలెను మాయమైపోవు జలప్రవాహములవలెను నమ్మకూడని వారైరి.

యోబు 6:16

మంచుగడ్డలుండుటవలనను హిమము వాటిలో పడుటవలనను అవి మురికిగా కనబడును

యోబు 6:17

వేసవి రాగానే అవి మాయమైపోవును వెట్ట కలుగగానే అవి తమ స్థలమును విడిచి ఆరిపోవును.

యోబు 6:18

వాటి నీళ్లు ప్రవహించు దారి త్రిప్పబడును, ఏమియు లేకుండ అవి యింకిపోవును.

యోబు 6:19

సమూహముగా ప్రయాణము చేయు తేమా వర్తకులు వాటిని వెదకుదురు షేబ వర్తకులు వాటికొరకు కనిపెట్టుదురు.

యోబు 6:20

వారు వాటిని నమ్మినందుకు అవమానమొందుదురు వాటి చేరువకు వచ్చి కలవరపడుదురు.

యోబు 6:21

అటువలె మీరు లేనట్టుగానే యున్నారు మీరు ఆపదను చూచి భయపడుచున్నారు.

యోబు 6:22

ఏమైన దయచేయుడని నేను మిమ్మునడిగితినా? మీ ఆస్తిలోనుండి నాకొరకు బహుమానమేమైన తెమ్మని యడిగితినా?

యోబు 6:23

పగవానిచేతిలోనుండి నన్ను విడిపింపుడని యడిగితినా? బాధించువారి చేతిలోనుండి నన్ను విమోచింపుడని యడిగితినా?

యోబు 19:13

ఆయన నా సోదరజనమును నాకు దూరముచేసియున్నాడు నా నెళవరులు నాకు కేవలము అన్యులైరి.

యోబు 19:14

నా బంధువులు నాయొద్దకు రాకయున్నారు నా ప్రాణస్నేహితులు నన్ను మరచిపోయి యున్నారు.

యోబు 19:15

నా యింటి దాస దాసీ జనులు నన్ను అన్యునిగా ఎంచెదరు నేను వారి దృష్టికి పరదేశినై యున్నాను.

యోబు 19:16

నేను నా పనివాని పిలువగా వాడేమి పలుకకుండనున్నాడు నేను వాని బతిమాలవలసి వచ్చెను.

యోబు 19:17

నా ఊపిరి నా భార్యకు అసహ్యము నేను కనిన కుమారులకు నా వాసన అసహ్యము.

ఆదికాండము 14:17

అతడు కదొర్లాయోమెరును అతనితో కూడనున్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతనిని ఎదుర్కొనుటకు, రాజులోయ అను షావే లోయ మట్టుకు బయలుదేరి వచ్చెను.

నిర్గమకాండము 23:8

లంచము తీసికొనకూడదు; లంచము దృష్టిగలవానికి గ్రుడ్డితనము కలుగజేసి, నీతిమంతుల మాటలకు అపార్థము చేయించును.