సామెతలు 22: 20
క్రాస్-రిఫరెన్స్‌లు
" నిన్ను పంపువారికి నీవు సత్యవాక్యములతో ప్రత్యుత్తరమిచ్చునట్లు సత్యప్రమాణము నీకు తెలియజేయుటకై"
సంబంధిత రిఫరెన్స్‌లు
నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము
జనులారా, యెల్లప్పుడు ఆయనయందు నమ్మికయుంచుడి ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి దేవుడు మనకు ఆశ్రయము.(సెలా.)
ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను యెహోవా యెహోవాయే నాకు బలము ఆయనే నా కీర్తనకాస్పదము ఆయన నాకు రక్షణాధారమాయెను
యెహోవా యెహోవాయే నిత్యాశ్రయదుర్గము యుగయుగములు యెహోవాను నమ్ముకొనుడి.
యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును.
మీరు క్షయ బీజమునుండి కాక, శాశ్వతమగు జీవముగల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజమునుండి పుట్టింపబడినవారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు,
నా దేవుడైన యెహోవా నాకాజ్ఞాపించినట్లు మీరు స్వాధీనపరచుకొనబోవు దేశమున మీరాచరింపవలసిన కట్టడలను విధులను మీకు నేర్పితిని.
నీ దేవుడైన యెహోవా చేసిన శిక్షను ఆయన మహిమను ఆయన బాహుబలమును ఆయన చాపిన చేతిని
ఉపదేశమునకు చెవి యొగ్గువాడు మేలునొందును యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు.