లేఖనాలను అన్వేషించండి

సామెతలు 23: 26

క్రాస్-రిఫరెన్స్‌లు

" నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా నుండనిమ్ము,"

సంబంధిత రిఫరెన్స్‌లు

సామెతలు 17:25

బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి దుఃఖము తెచ్చును తన్ను కనినదానికి అట్టివాడు బాధ కలుగజేయును

1దినవృత్తాంతములు 4:9

యబ్బేజు1 తన సహోదరులకంటె ఘనము పొందినవాడైయుండెను వేదనపడి యితని కంటినని అతని తల్లి అతనికి యబ్బేజు అని పేరుపెట్టెను.

1దినవృత్తాంతములు 4:10

యబ్బేజు ఇశ్రాయేలీయుల దేవునిగూర్చి మొఱ్ఱపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడురాకుండ దానిలోనుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవిచేసిన దానిని అతనికి దయచేసెను.

లూకా 1:31

ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు;

లూకా 1:32

ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును; ప్రభువైన దేవుడు ఆయన తండ్రియైన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును.

లూకా 1:33

ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును; ఆయన రాజ్యము అంతములేనిదై యుండునని ఆమెతో చెప్పెను.

లూకా 1:40

జెకర్యా యింటిలో ప్రవేశించి, ఎలీసబెతుకు వందనము చేసెను.

లూకా 1:41

ఎలీసబెతు మరియ యొక్క వందనవచనము వినగానే, ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంతట ఎలీసబెతు పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లనెను

లూకా 1:42

స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడినదానవు నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును

లూకా 1:43

నా ప్రభువు తల్లి నాయొద్దకు వచ్చుట నాకేలాగు ప్రాప్తించెను?

లూకా 1:44

ఇదిగో నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను.

లూకా 1:45

ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలనెను.

లూకా 1:46

అప్పుడు మరియ యిట్లనెను నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది.

లూకా 1:47

ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను

లూకా 1:58

అప్పుడు ప్రభువు ఆమెమీద మహా కనికరముంచెనని ఆమె పొరుగువారును బంధువులును విని ఆమెతో కూడ సంతోషించిరి.

లూకా 11:27

ఆయన యీ మాటలు చెప్పుచుండగా ఆ సమూహములో నున్న యొక స్త్రీ ఆయనను చూచి నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములును ధన్యములైనవని కేకలువేసి చెప్పగా

లూకా 11:28

ఆయన అవునుగాని దేవుని వాక్యము విని దానిని గైకొనువారు మరి ధన్యులని చెప్పెను.

సామెతలు 10:1

జ్ఞానముగల కుమారుడు తండ్రిని సంతోషపరచును బుద్ధిలేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును.

సామెతలు 23:15

నా కుమారుడా, నీ హృదయమునకు జ్ఞానము లభించినయెడల నా హృదయముకూడ సంతోషించును.

సామెతలు 27:11

నా కుమారుడా, జ్ఞానమును సంపాదించి నా హృదయమును సంతోషపరచుము. అప్పుడు నన్ను నిందించువారితో నేను ధైర్యముగా మాటలాడుదును.

సామెతలు 29:3

జ్ఞానమును ప్రేమించువాడు తన తండ్రిని సంతోషపరచును వేశ్యలతో సాంగత్యము చేయువాడు అతని ఆస్తిని పాడుచేయును.