లేఖనాలను అన్వేషించండి

సామెతలు 29: 21

క్రాస్-రిఫరెన్స్‌లు

" ఒకడు తన దాసుని చిన్నప్పటినుండి గారాబముగా పెంచినయెడల తుదిని వాడు కుమారుడుగా ఎంచబడును."

సంబంధిత రిఫరెన్స్‌లు

సామెతలు 29:11

బుద్ధిహీనుడు తన కోపమంత కనుపరచును జ్ఞానము గలవాడు కోపము అణచుకొని దానిని చూపకుండును.

ప్రసంగి 5:2

నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనియ్యక నీ నోటిని కాచుకొమ్ము; దేవుడు ఆకాశమందున్నాడు నీవు భూమిమీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను.

యాకోబు 1:19

నా ప్రియ సహోదరులారా, మీరీసంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదా నించువాడునై యుండవలెను.

సామెతలు 14:29

దీర్ఘశాంతము గలవాడు మహా వివేకి ముంగోపి మూఢత్వమును బహుమానముగా పొందును.

సామెతలు 21:5

శ్రద్ధగలవారి యోచనలు లాభకరములు తాలిమి లేక పనిచేయువానికి నష్టమే ప్రాప్తించును

సామెతలు 26:12

తన దృష్టికి జ్ఞానిననుకొనువానిని చూచితివా? వానిని గుణపరచుటకంటె మూర్ఖుని గుణపరచుట సుళువు.

యోబు 20:2

ఆలాగున నీవు చెప్పినందుకు నాయందలి ఆతురత తగిన ప్రత్యుత్తరము సిద్ధపరచియున్నది.

సామెతలు 15:28

నీతిమంతుని మనస్సు యుక్తమైన ప్రత్యుత్తరమిచ్చుటకు ప్రయత్నించును భక్తిహీనుల నోరు చెడ్డమాటలు కుమ్మరించును