సామెతలు 3: 23
క్రాస్-రిఫరెన్స్‌లు
" అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు నీ పాదము ఎప్పుడును తొట్రిల్లదు."
సంబంధిత రిఫరెన్స్‌లు
దొరికినవారికి అవి జీవమును వారి సర్వశరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును.
ప్రభువా, వీటివలన మనుష్యులు జీవించుదురు వీటివలననే నా ఆత్మ జీవించుచున్నది నీవు నన్ను బాగుచేయుదువు నన్ను జీవింపజేయుదువు
ఏలయనగా నా అంతట నేనే మాటలాడలేదు; నేను ఏమనవలెనో యేమి మాటలాడవలెనో దానినిగూర్చి నన్ను పంపిన తండ్రియే నాకాజ్ఞ యిచ్చియున్నాడు.
మరియు ఆయన ఆజ్ఞ నిత్యజీవమని నేనెరుగుదును గనుక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పినప్రకారము చెప్పుచున్నాననెను.
అవి నీ తలకు సొగసైన మాలికయు నీ కంఠమునకు హారములునై యుండును
ఇది మీకు నిరర్థకమైన మాటకాదు, ఇది మీకు జీవమే. మరియు మీరు స్వాధీనపరచుకొనుటకు యొర్దానును దాటబోవుచున్న దేశములో దీనినిబట్టి మీరు దీర్ఘాయుష్మంతులగుదురు.
అది నీ తలకు అందమైన మాలికకట్టును ప్రకాశమానమైన కిరీటమును నీకు దయచేయును.
ఉపదేశమును విడిచిపెట్టక దాని గట్టిగా పట్టుకొనుము అది నీకు జీవము గనుక దాని పొందియుండుము