లేఖనాలను అన్వేషించండి

సామెతలు 6: 11

క్రాస్-రిఫరెన్స్‌లు

" అందుచేత దోపిడిగాడు వచ్చునట్లు దారిద్ర్యము నీయొద్దకు వచ్చును. ఆయుధధారుడు వచ్చునట్లు లేమి నీయొద్దకు వచ్చును."

సంబంధిత రిఫరెన్స్‌లు

సామెతలు 6:6

సోమరీ, చీమల యొద్దకు వెళ్లుము వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము.

సామెతలు 23:33

విపరీతమైనవి నీ కన్నులకు కనబడును నీవు వెఱ్ఱిమాటలు పలుకుదువు

సామెతలు 23:34

నీవు నడిసముద్రమున పండుకొను వానివలె నుందువు ఓడకొయ్య చివరను పండుకొనువానివలె నుందువు.

సామెతలు 24:33

ఇంక కొంచెము నిద్ర యింక కొంచెము కునుకుపాటు పరుండుటకై యింక కొంచెము చేతులు ముడుచుకొనుట

సామెతలు 24:34

వీటివలన నీకు దరిద్రత పరుగెత్తి వచ్చును ఆయుధస్థుడు వచ్చినట్లు లేమి నీమీదికి వచ్చును.

సామెతలు 6:4

ఈలాగు చేసి తప్పించుకొనుము నీ కన్నులకు నిద్రయైనను నీ కనురెప్పలకు కునుకుపాటైనను రానియ్యకుము.

సామెతలు 19:15

సోమరితనము గాఢనిద్రలో పడవేయును సోమరివాడు పస్తు పడియుండును.

సామెతలు 19:24

సోమరి పాత్రలో చెయ్యి ముంచునేగాని తన నోటికి దాని తిరిగి ఎత్తనైన ఎత్తడు.

సామెతలు 20:4

విత్తులువేయు కాలమున సోమరి దున్నడు కోతకాలమున పంటనుగూర్చి వాడు విచారించునప్పుడు వానికేమియు లేకపోవును.

సామెతలు 26:14

ఉతకమీద తలుపు తిరుగును తన పడకమీద సోమరి తిరుగును.

ప్రసంగి 4:5

బుద్ధిహీనుడు చేతులు ముడుచుకొని తన మాంసము భక్షించును.