సామెతలు 9: 18
క్రాస్-రిఫరెన్స్‌లు
" అయితే అచ్చట ప్రేతలున్నారనియు దాని ఇంటికి వెళ్లువారు పాతాళకూపములో ఉన్నారనియు వారికి ఎంతమాత్రమును తెలియలేదు."
సంబంధిత రిఫరెన్స్‌లు
మోసముచేసి తెచ్చుకొన్న ఆహారము మనుష్యులకు బహు ఇంపుగా ఉండును పిమ్మట వాని నోరు మంటితో నింపబడును.
ద్రాక్షారసము మిక్కిలి ఎఱ్ఱబడగను గిన్నెలో తళతళలాడుచుండగను త్రాగుటకు రుచిగా నుండగను దానివైపు చూడకుము.
పిమ్మట అది సర్పమువలె కరచును కట్లపామువలె కాటువేయును.
స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియునై యుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసికొని తిని తనతోపాటు తన భర్తకును ఇచ్చెను, అతడుకూడ తినెను;
అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసికొని సకలవిధమైన దురాశలను నాయందు పుట్టించెను. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము.
ప్రతివాడును తన స్వకీయమైన దురాశచేత ఈడ్వబడి మరులుకొల్పబడినవాడై శోధింపబడును.
దురాశ గర్భము ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమై మరణమును కనును.
ఉదయము వరకు వలపుదీర తృప్తిపొందుదము రమ్ము పరస్పర మోహముచేత చాలా సంతుష్టి నొందుదము రమ్ము.
పురుషుడు ఇంట లేడు దూరప్రయాణము వెళ్లియున్నాడు
అతడు సొమ్ముసంచిచేత పట్టుకొనిపోయెను. పున్నమనాటివరకు ఇంటికి తిరిగి రాడు అనెను
జారిణియొక్క చర్యయును అట్టిదే; అది తిని నోరు తుడుచుకొని నేను ఏ దోషము ఎరుగననును.
మెట్లదగ్గరకు వారు రాగానే వారియొద్దనుండి గేహజీ వాటిని తీసికొని యింటిలో దాచి వారికి సెలవియ్యగా వారు వెళ్లిపోయిరి.
అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలువగా ఎలీషా వానిని చూచి గేహజీ, నీవెచ్చటనుండి వచ్చితివని అడిగినందుకు వాడు నీ దాసుడనైన నేను ఎచ్చటికిని పోలేదనెను.
అంతట ఎలీషా వానితో ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతోకూడ రాలేదా? ద్రవ్యమును వస్త్రములను ఒలీవచెట్ల తోటలను ద్రాక్షతోటలను గొఱ్ఱలను ఎడ్లను దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా?
కాబట్టి నయమానునకు కలిగిన కుష్ఠు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండును అని చెప్పగా వాడు మంచువలె తెల్లనైన కుష్ఠము గలిగి ఎలీషా ఎదుటనుండి బయటికి వెళ్లెను.
ఏలయనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులనుగూర్చి మాటలాడుటయైనను అవమానకరమైయున్నది.
అట్లుండగా ఒకనాడు అతడు తన పనిమీద ఇంటి లోపలికి వెళ్లినప్పుడు ఇంటి మనుష్యులలో ఎవరును అక్కడ లేరు.
దాని పెనిమిటి బహూరీమువరకు దాని వెనుక ఏడ్చుచు రాగా అబ్నేరు నీవు తిరిగి పొమ్మనెను గనుక అతడు వెళ్లిపోయెను.
చెడుతనము వారి నోటికి తియ్యగా నుండెను వారు నాలుకక్రింద దాని దాచిపెట్టిరి.
వారు స్వనాశనమునకే పొంచియుందురు తమ్మును తామే పట్టుకొనుటకై దాగియుందురు.
కీడుచేత దొరికినదానిని వారు భుజింతురు బలాత్కారముచేత దొరికిన ద్రాక్షారసమును త్రాగుదురు
వచ్చి నేను సిద్ధపరచిన ఆహారమును భుజించుడి నేను కలిపిన ద్రాక్షారసమును పానము చేయుడి
అప్పటి క్రియలవలన మీకేమి ఫలము కలిగెను? వాటిని గురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతము మరణమే,