కీర్తనలు 10: 11
క్రాస్-రిఫరెన్స్‌లు
" దేవుడు మరచిపోయెను ఆయన విముఖుడై యెప్పుడును చూడకుండును అని వారు తమ హృదయములలో అనుకొందురు."
సంబంధిత రిఫరెన్స్‌లు
మేము కదల్చబడము, తరతరములవరకు ఆపద చూడము అని వారు తమ హృదయములలో అనుకొందురు
శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చుండియుండిరి.
ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి ఈయన ప్రవక్తయైనయెడల తన్ను ముట్టుకొనిన యీ స్త్రీ ఎవతెయో ఎటువంటిదో యెరిగియుండును; ఇది పాపాత్మురాలు అని తనలో తాననుకొనెను.
వారు దురాలోచన దృఢపరచుకొందురు చాటుగా ఉరుల నొడ్డుటకు యోచించుకొనుచు మనలను ఎవరు చూచెదరని చెప్పుకొందురు.
దేవుడు ఎట్లు తెలిసికొనును మహోన్నతునికి తెలివియున్నదా? అని వారనుకొందురు.
విధవరాండ్రను పరదేశులను చంపుచున్నారు తండ్రిలేనివారిని హతము చేయుచున్నారు.
దేవునికి ఏమి తెలియును? గాఢాంధకారములోనుండి ఆయన న్యాయము కనుగొనునా?
గాఢమైన మేఘములు ఆయనకు చాటుగా నున్నవి, ఆయన చూడలేదు ఆకాశములో ఆయన తిరుగుచున్నాడు అని నీవనుకొనుచున్నావు.
దుష్‌క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవుటచూచి మనుష్యులు భయమువిడిచి హృదయపూర్వకముగా దుష్‌క్రియలు చేయుదురు.
అప్పుడాయన నాకు సెలవిచ్చినదేమనగా నరపుత్రుడా యెహోవా మమ్మును కానకయుండును, యెహోవా దేశమును విసర్జించెను అని యనుకొని, ఇశ్రాయేలీయుల పెద్దలు చీకటిలో తమ విగ్రహపు గదులలో వారిలో ప్రతివాడు చేయుదానిని నీవు చూచుచున్నావు గదా.
ఆయన నాకీలాగు సెలవిచ్చెను ఇశ్రాయేలు వారి యొక్కయు యూదావారి యొక్కయు దోషము బహు ఘోరముగా ఉన్నది; వారు యెహోవా దేశమును విసర్జించెననియు ఆయన మమ్మును కానడనియు ననుకొని, దేశమును హత్యతోను పట్టణమును తిరుగుబాటుతోను నింపియున్నారు.
అందుకు సర్పము మీరు చావనే చావరు;
అట్టి పనులను చేయువాడు ఈ శాప వాక్యములను వినునప్పుడు, మద్యముచేత దప్పి తీర్చుకొనవలెనని నేను నా హృదయ కాఠిన్యమున నడుచుచుండినను నాకు క్షేమము కలుగునని, నేను ఆశీర్వాదము నొందెదనని అనుకొనును.
మీకాయాను పిలువబోయిన దూత ప్రవక్తలు ఏకముగా రాజుతో మంచి మాటలు పలుకుచున్నారు గనుక నీ మాట వారి మాటకు అనుకూలపరచుమని అతనితో అనగా
మీకాయాను పిలుచుటకు పోయిన దూత అతని కనుగొని ప్రవక్తలు రాజు విషయమై యేక ముఖముగా మేలునే పలుకుచున్నారు, దయచేసి నీమాటను వారి మాటలకు అనుకూలపరచి మేలునే ప్రవచింపుమనగా
పనికిమాలినవారెవరో ఆయనే యెరుగును గదా పరిశీలన చేయకయే పాపము ఎక్కడ జరుగుచున్నదో ఆయనే తెలిసికొనును గదా.
వారు నీ మార్గములనుగూర్చిన జ్ఞానము మాకక్కరలేదు నీవు మమ్మును విడిచిపొమ్మని దేవునితో చెప్పుదురు.
వ్యభిచారి ఏ కన్నైనను నన్ను చూడదనుకొని తన ముఖమునకు ముసుకు వేసికొని సందె చీకటికొరకు కనిపెట్టును.
నేను మరణనిద్ర నొందకుండను వాని గెలిచితినని నా శత్రువు చెప్పుకొనకుండను నేను తూలిపోయి యుండగా నా విరోధులు హర్షింపకుండను నా కన్నులకు వెలుగిమ్ము.
నీ ముఖమును నీ వేల మరుగుపరచియున్నావు? మా బాధను మాకు కలుగు హింసను నీవేల మరచియున్నావు?
దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. వారు చెడిపోయినవారు, అసహ్యకార్యములు చేయుదురు మేలుచేయువాడొకడును లేడు.
వినువారెవరును లేరనుకొని వారు తమ నోటనుండి మాటలు వెళ్లగ్రక్కుదురు. వారి పెదవులలో కత్తులున్నవి.
ఎగతాళి చేయుచు బలాత్కారముచేత జరుగు కీడునుగూర్చి వారు మాటలాడుదురు. గర్వముగా మాటలాడుదురు.
నీమీదికి లేచువారి అల్లరి నిత్యము బయలుదేరుచున్నది. నీ విరోధులు చేయు గల్లత్తును మరువకుము.
దేవా, గర్విష్ఠులు నా మీదికి లేచియున్నారు బలాత్కారులు గుంపుకూడి నా ప్రాణము తీయజూచుచున్నారు వారు నిన్ను లక్ష్యపెట్టనివారైయున్నారు.
మా దోషములను నీవు నీ యెదుట నుంచుకొనియున్నావు నీ ముఖకాంతిలో మా రహస్యపాపములు కనబడుచున్నవి.
అంధకారము నన్ను మరుగుచేయును నాకు కలుగు వెలుగు రాత్రివలె ఉండును అని నేననుకొనినయెడల
వ్యర్థుడైన సాక్షి న్యాయము నపహసించును భక్తిహీనుల నోరు దోషమును జుర్రుకొనును.
భక్తిహీనతయను త్రాళ్లతో దోషమును లాగుకొనువారికి శ్రమ. బండిమోకులచేత పాపమును లాగుకొనువారికి శ్రమ వారు ఇట్లనుకొనుచున్నారు
తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండ లోలోపల వాటిని మరుగుచేయ జూచువారికి శ్రమ. మమ్మునెవరు చూచెదరు? మా పని యెవరికి తెలియును? అనుకొని చీకటిలో తమ క్రియలు జరిగించువారికి శ్రమ.
నీ చెడుతనమును నీవు ఆధారము చేసికొని యెవడును నన్ను చూడడని అనుకొంటివి నేనున్నాను నేను తప్ప మరి ఎవరును లేరని నీవనుకొనునట్లుగా నీ విద్యయు నీ జ్ఞానమును నిన్ను చెరిపివేసెను.
యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా నాకు కనబడకుండ రహస్య స్థలములలో దాగగలవాడెవడైన కలడా? నేను భూమ్యాకాశముల యందంతట నున్నవాడను కానా? యిదే యెహోవా వాక్కు.
వారిని చూడకుండ నా ముఖమును నేను త్రిప్పుకొందును గనుక శత్రువులు నా నిధిస్థానమును అపవిత్రపరచుదురు, దొంగలు చొరబడి దానిని అపవిత్రపరచుదురు.
యాకోబు యొక్క అతిశయాస్పదము తోడని యెహోవా ప్రమాణము చేయునదేమనగా వారి క్రియలను నేనెన్నడును మరువను.
ఆ కీడు మనలను తరిమి పట్టదు, మనయొద్దకు రాదు అని నా జనులలో అనుకొను పాపాత్ములందరును ఖడ్గముచేత చత్తురు.
ఆ కాలమున నేను దీపములు పట్టుకొని యెరూషలేమును పరిశోధింతును, మడ్డిమీద నిలిచిన ద్రాక్షారసమువంటివారై యెహోవా మేలైనను కీడైనను చేయువాడు కాడని మనస్సులో అనుకొనువారిని శిక్షింతును.
మీ మాటలచేత మీరు యెహోవాను ఆయాసపెట్టుచు, దేనిచేత ఆయనను ఆయాసపెట్టుచున్నామని మీరడుగుచున్నారే. దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారు, వారియందు ఆయన సంతోషపడును;లేక న్యాయకర్తయగు దేవుడు ఏమాయెను అని చెప్పుకొనుటచేతనే మీరాయనను ఆయాసపెట్టుచున్నారు.
యెహోవా సెలవిచ్చునదేమనగా నన్నుగూర్చి మీరు బహు గర్వపు మాటలు పలికి నిన్నుగూర్చి యేమి చెప్పితిమని మీరడుగుదురు.
లేదా, దేవుని అనుగ్రహము మారుమనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని యెరుగక, ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా?
లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమియులేదని చెప్పుకొనుచుండగా, గర్భిణి స్త్రీకి ప్రసవవేదన వచ్చునట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు